సుధీర్ బాబుకి పెళ్ళిచూపులు-Sudheer Babu Will Be Introduced To Bollywood Today 9 months

Bhaagi Movie Promotions Sudheer Babu Sudheer Will Be Introduced To Bollywood Today Photo,Image,Pics-

సుధీర్ బాబుకి పెళ్ళి చూపులా ? అదేంటి .. మహేష్ బాబు చెల్లిని ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు కదా. పైగా ఇద్దరు పిల్లలు కూడా. కొంపదీసి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా ? వామ్మో … మహేష్ బాబు దీనికి ఒప్పుకున్నాడా ? ఇలా ఏది పడితే అది ఊహించేసుకోకండి. సుధీర్ కి ఈరోజు నేషనల్ మీడియాతో పెళ్ళిచూపులు జరగనున్నాయి.

ఇంకా అర్థం కాలేదా ? “బాఘి” చిత్రంతో బాలివుడ్ కి పరిచయమవుతున్నాడు కదా ఈ కుర్ర హీరో. ఈ రోజు బాలివుడ్ మీడియాకి సుధీర్ పరిచయం చేయనుంది చిత్ర యూనిట్. సుధీర్ పరిచయ కార్యక్రమంతో పాటు, స్పెషల్ ఇంటర్వ్యూలు ఉంటాయట. ఈ విషయాన్నే సరదాగా నేషనల్ మీడియాతో పెళ్ళిచూపులు అని చెప్పాడు సుధీర్. మరో పది పదిహేను రోజులు ముంబైలోనే ప్రమోషన్స్ లో బిజీగా ఉంటాడు ఈ కండల వీరుడు.

బాఘి లో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సుధీర్ హీరోతో సమానంగా సాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడు. సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. ఏప్రిల్ 29న బాఘి ప్రేక్షకుల ముందుకి రానుంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. ఇక ఆ హీరోయిన్ కి ఫ్లాప్ అనేదే రాదా ?

About This Post..సుధీర్ బాబుకి పెళ్ళిచూపులు

This Post provides detail information about సుధీర్ బాబుకి పెళ్ళిచూపులు was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Sudheer Babu will be introduced to Bollywood today, Sudheer Babu, Bhaagi, Bhaagi Movie Promotions

Tagged with:Sudheer Babu will be introduced to Bollywood today, Sudheer Babu, Bhaagi, Bhaagi Movie PromotionsBhaagi,Bhaagi Movie Promotions,sudheer babu,Sudheer Babu will be introduced to Bollywood today,,