నందమూరి - ఘట్టమనేని .. ఒకే సినిమాలో?

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా హంగులు ఆర్భాటల నడుమ ఈరోజు మొదలైంది.భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.

 Sudheer Babu In Balakrishna – Puri Movie ?-TeluguStop.com

ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి సెన్సెషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలింసిందే.ఈ క్రేజి సినిమాకి సంబంధించి మరో క్రేజి న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది.

అదేంటంటే, యువరత్న సినిమాలో సూపర్ స్టార్ ఫ్యామిలి హీరో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించనున్నాడట.

ఆ హీరో ఎవరో కాదు, టాలివుడ్ లో మొదలుపెట్టి, బాలివుడ్ వైపు అడుగులేస్తున్న సుధీర్ బాబు.

ఈ యువహీరో బాలకృష్ణ సరికొత్త సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు ఫిలింనగర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇందులో నిజానిజాలు తెలియదు కాని, ఈరోజు జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సుధీర్ రావడంతో, ఈ వార్తలకి కొత్త సాక్ష్యం దొరికినట్లయింది.

చాలారోజులుగా బాలకృష్ణతో మహేష్ బాబు అనే వార్తలు వస్తున్నాయిగా, నిజానికి సుధీర్ బాబుకి బదులు మహేష్ బాబు అని పొరబడినట్టుంది మీడియా.ఇదే గనుక నిజమైతే నందమూరి – ఘట్టమనేని అభిమానులకి పండగే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube