అక్కడ పిల్లలని మద్యం తాగమని తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారట

14 ఏళ్ళ వయసులో మన అలవాట్లు ఎలా ఉండేవో ఓసారి గుర్తు తెచ్చుకోండి.స్కూలుకి వెళ్లి వచ్చామంటే ఇంటి ముందు ఆటలాడటమే మనకి తెలుసు.

 Study Reveals That Most Of Uk Parents Allow Kids Under 14 To Booze At Home-TeluguStop.com

సండే వస్తే గ్రౌండ్ కి వెళ్ళి క్రికెట్ ఆడటం తెలుసు, ఇష్టమైన కార్టూన్ చూడటం తెలుసు.ఇప్పుడు కాలం మారింది.

స్మార్ట్ ఫోన్ యుగం పిల్లల్ని అవసరానికి మించి స్మార్ట్ గా మార్చేసింది.తల్లిదండ్రుల కంటికి చిక్కకుండా చాలామంది పిల్లలు దురలవాట్లు నేర్చేసుకుంటారు.

తల్లిదండ్రుల కళ్ళుకప్పడం ఇక్కడి పిల్లల పద్ధతైతే, తల్లిందండ్రుల ముందే అన్నీ చేయడం యూకే పిల్లల పద్ధతి.విచిత్రం ఏమిటంటే అక్కడి పిల్లలకి పేరెంట్స్ సపోర్టు కూడా ఉంటోంది.

యూకేలో సగానికి ఎక్కువమంది తల్లిందండ్రులు 14 ఏళ్ళ లోపు పిల్లలకి ఇంట్లోనే మద్యం సేవించేందుకు అనుమతిని ఇస్తున్నారట.డెయిలీ మెయిల్ ప్రచూరించిన కథనం ప్రకారం చర్చిల్ హోమ్ ఇన్సూరెన్స్ 1000 పెరెంట్స్ మీద జరిపిన ఈ సర్వేలో సగానికి ఎక్కువమంది ఇంట్లోనే తమ పిల్లలు మద్యం తాగేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

మరో విచిత్రమైన విషయం ఏమింటే … ఇక్కడి తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలు మరాం చేసినప్పుడు ఏ చాకోలేటో, వీడియోగేమ్ కొనిస్తామని ఆశపెట్టి మాట వినేలా చేస్తారో, యూకేలో మద్యం తెచ్చిపెడతామని ఆశపెడుతున్నారట.వినటానికి విచిత్రంగా ఉంది కదూ … లోకంలో ఎన్నో వింత పోకడలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube