బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారో తెలుసా

బిగ్ బాస్ ఒక పెను సంచలనం.తెలుగులో ఒక రియాలిటి షోకి ఇంతటి పాపులారిటి, ఇలాంటి టీఆర్పి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు.

 Star Maa Confirms Big Boss Season 2 Host-TeluguStop.com

అందరి ఊహలను తలకిందులు చేస్తూ, అంచనాలకి మించి హిట్ అయ్యింది షో.తొలివారం కాస్త నిరాశపరిచి, కేవలం ఎన్టీఆర్ వచ్చే ఎపిసోడ్స్ మీదే నడిచినా, రెండోవవారం నుంచి ఎన్టీఆర్ లేని ఎపిసోడ్స్ కి కూడా ఆదరణ లభించింది.వారం వారం వీక్ ఎపిసోడ్స్ కి కూడా సగటు టీఆర్పి పెరుగుతోంది.6 నుంచి మొదలైన వీక్ డేస్ సగటు, ఇప్పుడు 8.7 కి చేరుకుంది.ప్రతి ఆదివారం 10 పాయింట్స్ కి పైగానే ఉంటోంది.కల్పన ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ కి భారి స్థాయిలో 11.3 టీఆర్పి వచ్చింది.

ఇదే ట్రెండ్ కొనసాగితే బిగ్ బాస్ ని ఆపడం జబర్దస్త్ వలన కూడా కాదేమో.మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి డిజాస్టర్ తరువాత స్టార్ మాకి బిగ్ బాస్ షో నిలబడటం అత్యవసరం.

అప్పటికే ప్లాన్ చేసుకొని 50 కోట్ల దాకా ఖర్చుపెట్టారు.అలాంటి కష్టాల్లోంచి గట్టెక్కి, ఇప్పుడు వరుసగా 5వ వారం తెలుగులో నెం.1 తెలుగు ఛానెల్ గా నిలిచింది స్టార్ మా.

అప్పుడే బిగ్ బాస్ సీజన్ 2 మీద ఆలోచనలు మొదలయ్యాయి.మరి సీజన్ 2 లో ఎవరు హోస్టింగ్ చేస్తే బాగుంటుంది? స్టార్ మా మీలో ఎవరు కోటీశ్వరుడు షో కోసం నాగార్జున ప్లేస్ లో చిరంజీవిని తీసుకొచ్చి ఇప్పటికే దెబ్బతింది, అందుకే కాబోలు, మళ్ళీ అలాంటి తప్పు చేయాలి అనుకోవట్లేదు.బిగ్ బాస్ 2 మీద ఇప్పటికే ఎన్టీఆర్ తో చర్చలు జరిగాయి.

సీజన్ 2 కూడా హోస్ట్ చేసేది ఎన్టీఆర్ కావడం విశేషం.ఎన్టీఆర్ కూడా బిగ్ బాస్ షోని సీజన్ 2 లో హోస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు.

ఈరకంగా, తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటి షో అయిన బిగ్ బాస్ పెద్ద బ్లాక్ బస్టర్ అవడంతో, అప్పుడే దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేసేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube