Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

ఒక హీరోయిన్ వదిలేసిన వాడితో మరో హీరోయిన్ ఎఫైర్ -Star Heroine’s Affair With Another Heroine’s Ex Boyfriend

తనొక స్టార్ హీరోయిన్. ఇండస్ట్రీలోకి బ్యాక్ గ్రౌండ్ తోనే వచ్చింది. అంతమాత్రాన తన సక్సెస్ ని తక్కువ చేసి చూడలేం. చాలా టాలెంటెడ్. అందుకే కెరీర్ లో అపజయాల శాతమే ఎక్కువ ఉన్నా, తన స్టార్ డం కానీ పాపులారిటి కాని తగ్గలేదు. అందుకు కారణం ఇండస్ట్రీలోని ఇద్దరు పెద్ద హీరోలతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు చేయడం. ఈమధ్య కొద్దిగా నెమ్మదించింది లెండి. అలాగే బరువు కూడా పెరిగిపోవడంతో దర్శకులు కొద్దిగా చిన్న చూపు చూస్తున్నారు. అయితే ఏం .. ఓటమి అప్పుడే ఒప్పుకోకుండా జిమ్ లో కష్టపడుతోంది. మళ్ళీ కంబ్యాక్ చేదామని ఆశలో ఉంది.

మరోవైపు మరో హీరోయిన్ ఒకప్పుడు పెద్ద స్టార్ గా వెలిగింది. దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ఆడిపాడింది. ఈవిడ కెరీర్ వయసు దశాబ్దం పైనే. కొద్దిగా వయసులోకి రావడం, ఎన్నో వివాదాలు తన వెనుక ఉండటంతో అవకాశాలు తక్కుముఖం పట్టాయి. ఇప్పుడు చేతిలో పెద్ద హీరోల సినిమాలేవీ లేవు కాని, ఏవో దొరికిన చిన్న సినిమాలు చేసుకుంటోంది. ఇప్పటిదాకా బాగా వెనకేసుకుంది. అవకాశాలు లేకున్నా, ఆర్ధికపరంగా ఎలాంటి చింత లేదు. అందుకే ఫారెన్ దేశాలు, బీచ్ లు బాగా చుట్టి వస్తోంది. ముందు నుంచి ఈ అమ్మడికి పార్టీలంటే పిచ్చి. ఏమాత్రం వీలు దొరికినా పార్టీల్లోనే కనబడుతోంది. అయితే ఈ మధ్య ప్రతి పార్టీలో ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తో కనబడుతోంది. అతడితో ఈ హీరోయిన్ ఎఫైర్ నడుపుతున్నట్లు బలమైన టాక్.

ఇక్కడ ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే, మనం ముందు మాట్లాడుకున్న హీరోయిన్ ఒకప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో ఉండేది. కొన్నాళ్ళు సాగిన వీరి ప్రేమాయణం బయటకి తెలియని కారణాలతో సమాప్తం అయ్యింది. ఆ హీరోయిన్ వదిలేసిన వాడినే, ఇప్పుడు ఈ హీరోయిన్ పట్టుకుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ బాయ్ ఫ్రెండ్ ఈ ఇద్దరు హీరోయిన్ల కంటే కూడా వయసులో చిన్న.

Continue Reading
More Posts
To Top