గంటకి 75 లక్షలు అడిగిన ఆగ్రనటుడు .. ఇదేం డబ్బు పిచ్చి

సిటిలోని ఓ పెద్ద స్కూలు తమ పిల్లల కోసం ఓ ఫంక్షన్ ప్లాన్ చేసారు.వారిలో ఉత్తేజం నింపడం కోసం, అలాగే ఫంక్షన్ లో కొంచెం గ్లామర్ నింపడం కోసం ఎవరైనా పెద్ద సినిమా తారని పిలిస్తే బాగుంటుంది అని అనుకున్నారు.

 Star Hero Demands 75 Lakh Just For One Hour-TeluguStop.com

మొదట ఇద్దరు ముగ్గురు హీరోల పేర్లు పరిశీలించినా, చేసేదేదో గట్టిగా చేద్దాం అని ఏకంగా ఓ స్టార్ హీరో కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.అటు చేసి ఇటు చేసి, మొత్తానికి ఆ హీరోతో డీల్ మాట్లాడే ధైర్యం అయితే చేసారు.

కాని షాక్ … ఆ హీరో ఎంత అడిగాడో తెలుసా ? అక్షరాల 75 లక్షలు.అది కూడా ఓ డిమాండ్ తో .ఆ డిమాండ్ ఏంటంటే, కేవలం గంటసేపే ఫంక్షన్ లో ఉంటానని.దీంతో ఆ స్కూలు యాజమాన్యం దిమ్మదిరిగింది.

ఒక్క గంటసేపు వచ్చి పిల్లలతో గడపటానికి 75 లక్షలు చెల్లించాలంటే తమ వల్ల కాదని సూటిగా చెప్పలేక, తరువాత ఫోన్ చేస్తాం సార్ అంటూ పెట్టేసారట.

ఇక ఫోన్ పెట్టేయగానే .ఆ హీరోని తిట్టుకోవడం మొదలుపెట్టారట స్కూల్ వాళ్ళు .వచ్చి పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పమంటే 75 లక్షలు గంటకి అడగటం ఏమిటి , డబ్బు వ్యామోహం కాకపొతే అంటూ నోటి పదును పెంచారట.

ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ ఫీజు అని ఈ ఫీజు అని లక్షలు లక్షలు ముక్కుపిండి వసూలు చేసే స్కూలు వాళ్ళు పిల్లల గురించి, డబ్బు మీద పిచ్చి గురించి మాట్లాడటం.ఇదే రిక్వెస్ట్ గనుక ఏదైనా ఉచిత విద్య సేవలు అందిస్తున్నవారు అడిగితే, ఆ హీరో మాత్రం ఇలా డబ్బులు డిమాండ్ చేసేవాడా ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube