చర్మవ్యాధిని దాచుకునేందుకు టాప్ హీరోయిన్ తంటాలు

సినిమా హీరోయిన్ అయినా, తాను ఒక మనిషే.తనది శరీరమే.

 Star Actress Trying Hard To Hide Her Skin Allergy-TeluguStop.com

ఎలాంటి సమస్య లేకుండా ఉండటం మనిషి శరీరాని లక్షణం కాదు కదా.కాని గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్స్ అంటే మనుషులు కాదు, అప్సరసలు.అలా అనుకుంటారు మరి.కాస్త లావెక్కినా, చిన్న మచ్చ పడినా, ఆ హీరోయిన్ ఎక్కడో ఏదో అవకాశం కోల్పోయినట్టే.అంత దారుణంగా వ్యవహరిస్తారు సినీజనాలు.ఇలాంటి పరిస్థితులు ఉన్న సినిమా లోకంలో ఓ చర్మవ్యాధి లేదా అలెర్జీతో బాధపడుతోంది ఒక క్రేజీ హీరోయిన్.

ముఖాన్ని ఎలాగోలా మేకప్ తో కవర్ చేసుకోవచ్చు కాని పాపం ఆ హీరోయిన్ నడుము దగ్గర స్కిన్ ప్రాబ్లం ఇబ్బందిపెడుతోంది.అక్కడ కూడా మేకప్ తో మేనేజ్ చేయొచ్చు కాని ఎంతైనా ఇబ్బందే కదా.దాంతో గ్లామర్ డ్రెస్సులు వేసుకోవడానికి ఆ హీరోయిన్ పడుతున్న తంటాలు వర్ణించడం కష్టం అని చెప్పాలి.

కాస్ట్యూమ్ ని పైకి, కిందికి అనుకుంటూ, తనకొచ్చిన చర్మ సమస్యను కప్పిపుచ్చేందుకు తెగ ఇబ్బంది పడిపోతోంది.

మరి ఇంత ఇబ్బందిపడే బదులు ట్రీట్‌మెంట్ మొదలుపెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు .ఒకేసారి రెండు మూడు సినిమాల షూటింగ్ లో పాల్గొనే హీరోయిన్లకి అంత టైమ్ ఎక్కడ దొరుకుతుందని.తనకోసం షూటింగ్ ఆపేసే స్థాయి కాదు, కొన్నిరోజులు విశ్రాంతి అడిగి, నిర్మాత తిట్లు తినలేదు.డేట్స్ ఇచ్చినప్పుడు షూటింగ్ చేయాల్సిందే.డేట్స్ మధ్యలో ఖాలి దొరికితే తప్ప ఈ అమ్మడి సమస్య తీరేలా లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube