Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మెగా ఫ్యామిలీ హీరోల‌తో రాజ‌మౌళి సినిమాలు లేన‌ట్టే..!-SS Rajamouli Says No Movie With Mega Family

బాహుబ‌లి కంక్లూజ‌న్ త‌ర్వాత రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏ హీరోతో ఉంటుంద‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో గ‌రుడ‌, మ‌హాభారతం, ఎన్టీఆర్, మ‌హేష్‌ల‌తో సినిమాలు ఇలా ర‌క‌ర‌కాల ఆన్స‌ర్లు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్ని ఆన్స‌ర్లు వ‌స్తున్నా రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా లిస్టులో మెగా హీరోల పేర్లు మాత్రం రావ‌డం లేదు. రాజ‌మౌళి ఇక ఫ్యూచ‌ర్‌లో మెగా హీరోల‌తో సినిమా చేసే ఛాన్స్ ఎంత మాత్రం లేద‌న్న వార్త‌లే ఇండ‌స్ట్రీలో జోరుగా ట్రెండ్ అవుతున్నాయి.

రాజ‌మౌళి ఇటీవ‌ల‌ ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన విష‌యాలే పై ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్‌గా మారాయా ? అన్న సందేహాలు కూడా ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. మ‌గ‌ధీర సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల విష‌యంలో అల్లు అర‌వింద్, మెగా కాంపౌండ్ వ‌ర్గాలు ఈ క్రెడిట్‌లో రాజ‌మౌళిని తొక్కిప‌ట్టి రాంచ‌ర‌ణ్‌కే ద‌క్కేలా చేశార‌న్న టాక్ అప్ప‌టి నుంచే ఉంది.

ఇక రాజ‌మౌళికి తాజా ఇంట‌ర్వ్యూలో ఇదే ప్ర‌శ్న ఎదుర‌వ్వ‌గా అలాంటిదేమి లేద‌ని చెప్పినా రికార్డుల విష‌యంలో ఫేక్ రికార్డులు చెప్ప‌వ‌ద్ద‌ని తాను ముందే చెప్పాన‌ని, అయితే నిర్మాత అల్లు అర‌వింద్ త‌న మాట ప‌ట్టించుకోకుండా మ‌గ‌ధీర విష‌యంలో కొన్ని ఫేక్ రికార్డులు చెప్పిన‌ట్టు రాజ‌మౌళి త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఇక మ‌గ‌ధీర 100 రోజుల ఫంక్ష‌న్‌కు కూడా తాను రాలేన‌ని అర‌వింద్‌కు చెప్పిన విష‌యాన్ని సైతం రాజ‌మౌళి దాచ‌లేదు. ఇక అర‌వింద్‌తో త‌న‌కు చాలా విష‌యాల్లో కోపాలు ఉన్నాయ‌ని రాజ‌మౌళి న‌వ్వుతూ చెప్పినా ఆయ‌న మాట‌ల్లో త‌న‌కు జ‌రిగిన అన్యాయం స్ప‌ష్టంగా క‌న‌ప‌డిన‌ట్ల‌య్యింద‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్నాయి.

అల్లు అర‌వింద్‌తో పాటు చిరంజీవితో వ‌చ్చిన ఈ తేడా వ‌ల్ల రాజ‌మౌళి ఇక వారితో స‌ర్దుకుపోయే ఛాన్సులు లేవ‌ని… ఇక మెగా ఫ్యామిలీ హీరోల‌తో రాజ‌మౌళి సినిమాలు ఉండ‌క‌పోవ‌చ్చ‌న్న టాక్‌ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

Continue Reading
More Posts
To Top