Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

అప్పుల తీర్చేందుకు ఇల్లు అమ్మేసుకున్న శ్రీనువైట్ల-Srinu Vaitla Sold His House For Clearing Debts

Telugu Gossips

అగ్రదర్శకుడు శ్రీనువైట్ల టైమ్ అస్సలు బాగాలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే ఆయన ఇంటికి వాస్తు బాగాలేదు. ఆగడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న సమయంలో యూసూఫ్ గూడలో ఉన్న ఫ్లాట్ నుంచి జర్నలిస్టు కాలనీలో కట్టుకున్న ఓ పెద్ద ఇంట్లోకి మారారు వైట్ల. అప్పటినుంచి ఆయనకి కలసి రావట్లేదు. ఆగడు భారీ డిజాస్టర్ కాగా, బ్రూస్ లీ కూడా నష్టాల్ని మూటగట్టుకుంది. ఇక కొత్తగా వచ్చిన మిస్టర్ మూడురోజుల్లోనే అడ్రెస్ లేకుండాపోయింది. సహజంగానే జాతకాలు, వాస్తు బాగా నమ్మే వైట్ల, ఈ ఫలితాలు చూసిన తరువాత ఆ ఇల్లు వాస్తు కలిసిరాకే ఇలాంటి దుర్గతి పట్టిందని భావిస్తున్నారు. ఇల్లు అమ్మేస్తున్నారు. కాని ఇల్లు అమ్మేయడానికి కారణం అదొక్కటే కాదు.

విషయంలోకి వెళ్తే, మిస్టర్ సినిమాని కథానుసారం బాగా లావిష్ గా తీయాలి. మొదటిభాగం కథ మొత్తం స్పేయిన్ లో ఉంటుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల ఉన్న ఫామ్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారు. దాంతో ఈ సినిమా క్వాలిటి కోసం రూపాయి పారితోషికం తీసుకోకుండా పనిచేసారు వైట్ల. అయితే సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటానని, కొన్ని ఏరియాల హక్కులు తన దగ్గరే ఉంచుకున్నారు వైట్ల. ఇప్పుడు అదే ఆలోచన ఆయన్ని అప్పుల్లోకి తోసింది.

సినిమా పెద్ద డిజాస్టర్. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు, వైట్లకి ఇటు రెమ్యునరేషన్ దక్కకపోగా, ఇప్పుడు ఆ ఏరియాల థియేట్రికల్ రైట్స్ ఉంచుకున్నందుకు నిర్మాతలకి డబ్బులు కట్టాలి. మూలిగే నక్కమీద తాటికాయ పడిందిగా. ఇప్పుడు ఆ అప్పులని తీర్చేందుకు తనకి కలిసిరాని ఇల్లు అమ్మేసుకుంటున్నారు వైట్ల. ఇటు గాడితప్పిన కెరీర్ గురించి బాధపడుతూ, అటు అప్పులు తీర్చేందుకు ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ, ఎవరు ఊహించని స్థితికి చేరిపోయారు మన దూకుడు డైరక్టర్.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,చిట్కాలు,వీడియోలు, అరుదైన ఫోటోలు క్రింద చూసి చదవండి

More in Telugu Gossips

  • Gossips

    Nithin to lead Janasena in Telangana?

    By

    ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పరమభక్తుల్లో హీరో నితిన్ ఒకరు. ఇష్క్ సినిమా నుంచి మొదలు, పవర్...

  • Gossips

    Srinu Vaitla sold his house for clearing debts

    By

    అగ్రదర్శకుడు శ్రీనువైట్ల టైమ్ అస్సలు బాగాలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే ఆయన ఇంటికి వాస్తు బాగాలేదు. ఆగడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న సమయంలో...

  • Gossips

    Mahesh Babu as Lord Krishna in 1000cr Mahabharata?

    By

    వెండితెరపైకి మహాభారతం కథని తీసుకురావాలి .. ఇదే రాజమౌళి, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల డ్రీమ్ ప్రాజెక్టు. మరికొన్నేళ్ళ వరకు...

  • Gossips

    Shruti Haasan lost that offer to Kiara Advani because of her figure?

    By

    మామూలుగానైతే మహేష్ పక్కన నటించే హీరోయిన్లను ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రిన్స్ గ్లామర్ ని తట్టుకోని నిలబడటం చాలా కష్టం. అపుడెప్పుడో...

To Top
Loading..