అప్పుల తీర్చేందుకు ఇల్లు అమ్మేసుకున్న శ్రీనువైట్ల

అగ్రదర్శకుడు శ్రీనువైట్ల టైమ్ అస్సలు బాగాలేదు.ఇంకోమాటలో చెప్పాలంటే ఆయన ఇంటికి వాస్తు బాగాలేదు.

 Srinu Vaitla Sold His House For Clearing Debts-TeluguStop.com

ఆగడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న సమయంలో యూసూఫ్ గూడలో ఉన్న ఫ్లాట్ నుంచి జర్నలిస్టు కాలనీలో కట్టుకున్న ఓ పెద్ద ఇంట్లోకి మారారు వైట్ల.అప్పటినుంచి ఆయనకి కలసి రావట్లేదు.

ఆగడు భారీ డిజాస్టర్ కాగా, బ్రూస్ లీ కూడా నష్టాల్ని మూటగట్టుకుంది.ఇక కొత్తగా వచ్చిన మిస్టర్ మూడురోజుల్లోనే అడ్రెస్ లేకుండాపోయింది.

సహజంగానే జాతకాలు, వాస్తు బాగా నమ్మే వైట్ల, ఈ ఫలితాలు చూసిన తరువాత ఆ ఇల్లు వాస్తు కలిసిరాకే ఇలాంటి దుర్గతి పట్టిందని భావిస్తున్నారు.ఇల్లు అమ్మేస్తున్నారు.

కాని ఇల్లు అమ్మేయడానికి కారణం అదొక్కటే కాదు.

విషయంలోకి వెళ్తే, మిస్టర్ సినిమాని కథానుసారం బాగా లావిష్ గా తీయాలి.

మొదటిభాగం కథ మొత్తం స్పేయిన్ లో ఉంటుంది.ప్రస్తుతం శ్రీనువైట్ల ఉన్న ఫామ్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని నిర్మాతలు భావించారు.

దాంతో ఈ సినిమా క్వాలిటి కోసం రూపాయి పారితోషికం తీసుకోకుండా పనిచేసారు వైట్ల.అయితే సినిమా హిట్ అయితే లాభాల్లో వాటా తీసుకుంటానని, కొన్ని ఏరియాల హక్కులు తన దగ్గరే ఉంచుకున్నారు వైట్ల.

ఇప్పుడు అదే ఆలోచన ఆయన్ని అప్పుల్లోకి తోసింది.

సినిమా పెద్ద డిజాస్టర్.

ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు, వైట్లకి ఇటు రెమ్యునరేషన్ దక్కకపోగా, ఇప్పుడు ఆ ఏరియాల థియేట్రికల్ రైట్స్ ఉంచుకున్నందుకు నిర్మాతలకి డబ్బులు కట్టాలి.మూలిగే నక్కమీద తాటికాయ పడిందిగా.

ఇప్పుడు ఆ అప్పులని తీర్చేందుకు తనకి కలిసిరాని ఇల్లు అమ్మేసుకుంటున్నారు వైట్ల.ఇటు గాడితప్పిన కెరీర్ గురించి బాధపడుతూ, అటు అప్పులు తీర్చేందుకు ఉన్న ఆస్తులు అమ్ముకుంటూ, ఎవరు ఊహించని స్థితికి చేరిపోయారు మన దూకుడు డైరక్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube