పొట్ట చేతపట్టి పరాయి దేశానికి .. అనారోగ్య సమస్యలను జయించలేక: సౌదీలో తెలుగు వ్యక్తి ఆత్మహత్య

నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలబడాలని భావించి దేశం కానీ దేశానికి వెళ్లిన ఓ తెలుగు బిడ్డ అనారోగ్య సమస్యలను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డారు.శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి సమీపంలోని సీతానగరం గ్రామానికి చెందిన బత్సల శంకరరావు (38) ఉపాధి కోసం గతేడాది సౌదీ అరేబియా వెళ్లాడు.2019 మార్చిలో అక్కడి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరి, వెల్డింగ్ పని చేస్తున్నాడు.అయితే శంకర్ రావు గత కొద్దిరోజులుగా కిడ్నీ, నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు .ఇక అక్కడ ఉండలేక వెంటనే భారతదేశానికి రావాలని ప్రయత్నించాడు.

 Srikakulam Based Telugu Nri Commits Suicide In Saudi Arabia, Saudi Arabia, Srika-TeluguStop.com

అయితే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఆయన ఆశ నెరవేరలేదు.

ఓ పక్క అనారోగ్య సమస్యలు, మరోవైపు భారత్‌లోని తమ కుటుంబసభ్యుల దగ్గరికి వెళ్లలేక శంకర్ రావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు.ఇదే సమయంలో జూన్ 15న ఆసుపత్రిలో చేరి కరోనా, ఇతర వైద్య పరీక్షలు చేయించుకున్నాడు.

దీనికి తోడు అతనిని అధికారులు ప్రత్యేక గదిలో ఉంచడంతో మరింతగా కృంగిపోయాడు.ఈ నెల 16, 17 తేదీల్లో కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మనసులోని బాధను చెప్పుకున్నాడు.

ఆ సమయంలో తనకు బతకాలని లేదని, చనిపోతానని చెప్పడంతో బంధువులు కాస్త ధైర్యం చెప్పారు.

అయినప్పటికీ మానసిక ఒత్తిడితో గురువారం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

శంకర్ రావు మరణవార్తను అధికారులు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు.భర్త మరణవార్త విని ఆయన భార్య, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదే విషాదం అనుకుంటే ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో శంకర్ రావు మృతదేహం భారతదేశానికి రావడం ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.దీంతో కుటుంబసభ్యులు తమకు సాయం చేయాల్సిందిగా స్థానిక రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube