టీనేజ్ అమ్మాయికి స్టెప్ మదర్ గా శ్రీ దేవి

నిజ జీవితంలో స్టెప్ మదర్ రోల్ ను సమర్ధవంతంగా పోషిస్తున్న ఎవర్‌గ్రీన్ బ్యూటీ శ్రీదేవి ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా అలాంటి పాత్ర పోషించేందుకు రెడీ అవుతుంది .ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రం హిట్ తర్వాత వరుసగా ఆఫర్లు వస్తున్నా, అన్నింటినీ ఓకే చేయకుండా నచ్చిన స్టోరీలకే ప్రయార్టీ ఇస్తోంది ఈ అతిలోక సుందరి .

 Sridevi To Play Stepmom In Her Next Movie-TeluguStop.com

ఈ మధ్యనే తమిళ హీరో విజయ్ సరసన అత్త పాత్ర పోషించడానికి ఓకే చెప్పిన శ్రీదేవి తాజాగా బాలీవుడ్‌లో నటించడానికి పచ్చ జెండా ఊపింది

విలక్షణమయిన కథ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీదేవి నటించనుందని ఆమె భర్త బోణీ కపూర్ వెల్లడించాడు .అయితే ఇందులో పద్దెనిమిదేళ్ల కూతురికి సవతి తల్లిగా కనిపించబోతుందని బోనీకపూర్ వెల్లడించాడు.ఇందులో శ్రీదేవి కూతురిగా కొత్తమ్మాయిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

తనే ఈ సినిమాని నిర్మిస్తున్నానని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లడం ఖాయమన్నారు.ఈ సినిమా స్టోరీ ఆమెకు బాగా నచ్చిందని, అందుకే నటించడానికి ఓకే చెప్పేసిందని వెల్లడించాడు.మరి రియల్ లైఫ్ లో అర్జున్ కపూర్ కు స్టెప్ మదర్ గా సక్సెస్ అయిన శ్రీదేవి రీల్ లైఫ్ లో ఏ మేర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube