2 కోట్లకు అమ్మ, అత్తకు ఓకే!

తెలుగు ప్రేక్షకులు అతిలోక సుందరిగా పిలుచుకునే శ్రీదేవి చాలా కాలం తర్వాత ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’తో రీ ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా తెలుగులో కూడా వచ్చినా పెద్దగా ఆమె అభిమానులను తృప్తి పర్చలేక పోయింది.

 Sridevi To Play Prabhas’s Mother Role-TeluguStop.com

అయితే త్వరలో శ్రీదేవి అమ్మగా లేక అత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.గతంలో పలు సినిమాల్లో ఈమెను నటించేందుకు పలువురు దర్శకులు వెంట పడినా కూడా ఓకే చెప్పని శ్రీదేవి, ఇప్పుడు అత్తగా అమ్మగా నటించేందుకు సై అంటోంది.

ఇప్పటికే తమిళంలో స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న ‘పులి’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జరుగుతోంది.

ఆ సినిమా పూర్తి కాకుండానే తెలుగులో మరో సినిమాలో శ్రీదేవి నటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదల కాగానే ప్రభాస్‌ యూవీ క్రియేషన్స్‌లో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఆ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తాడనే వార్తలు వస్తున్నాయి.ఆ సినిమాలో ప్రభాస్‌కు అమ్మగా నటించేందుకు శ్రీదేవిని సంప్రదించారనే టాక్‌ వినిపిస్తుంది.

అందుకు శ్రీదేవి నుండి సానుకూల సమాధానం వచ్చినట్లుగా చెబుతున్నారు.రెండు కోట్ల పారితోషికం ఇస్తే ఎలా నటించేందుకు అయినా సిద్దంగా ఉన్నానంటూ నిర్మాతలకు శ్రీదేవి చెప్పిందట.

దాంతో వారు పారితోషికం విషయం ఆలోచించకుండా శ్రీదేవిని ప్రభాస్‌కు తల్లిగా బుక్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube