టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా నిన్నటి తరం యువ ప్రేక్షకుల హృదయాల్లో కొలువు దీరిన శ్రీదేవి ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే.‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో శ్రీదేవి చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఈమె తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘గరుడ’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది.ఈ సినిమాలో శ్రీదేవి మహారాణి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది.
హన్సికకు తల్లిగా, ‘ఈగ’ ఫేం సుదీప్‌కు భార్యగా శ్రీదేవి కనిపించనుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు.
ఇక ఈ సినిమాకు శ్రీదేవి అయిదు కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకున్న ఇప్పటికే మీడియాలో వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.అయితే శ్రీదేవికి ఈ సినిమాలో లిప్ లాక్ సీన్ ఉందని అందుకు ఓకే చేప్పింది కనుకే ఇంత భారీ మొత్తం పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
సుధీప్తో శ్రీదేవి లిప్‌లాక్ సన్నివేశం ఉండనున్నట్లుగా తెలుస్తోంది.ఇక శ్రీదేవి హాట్ హాట్‌గా కూడా కనిపించనుందని అంటున్నారు.
ఈ లేటు వయస్సులో శ్రీదేవి అందాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతారా అనేది చూడాలి.