శ్రీనువైట్ల తదుపరి చిత్రం ఇదేనా ?

ఆగడు, బ్రూస్ లీ చిత్రాల ఫలితాలతో డీలపడి, మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు శ్రీను వైట్ల.ఆయన నెక్స్ట్ మూవీ ఏది ? ఏ హీరోతో చేయబోతున్నారు ? ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్.రాణా, రామ్ పేరులు వినిపించాయి.కాని ఏది ఓ కొలిక్కి రావడం లేదు.ఇప్పుడు కొత్తగా మొదలయ్యిన ఊహగానాలు ఏమిటంటే, వైట్ల తదుపరి చిత్రం ఒక యువ హీరోతో ఉంటుందట.ఆ యువ ఎవరు అనుకుంటున్నారు ? సుధీర్ బాబు.

 Sreenu Vaitla In Mahesh Production ?-TeluguStop.com

ఇటివలే ఒక చాట్ షోలో మాట్లాడుతూ తన తదుపరి చిత్రాన్ని మహేష్ నిర్మిస్తారని సుధీర్ చెప్పిన సంగతి తెలిసిందే.మహేష్ తొలిసారి పూర్తీ నిర్మాతగా మారుతుండడంతో ఈ సినిమా మీద భారి అంచనాలు ఉంటాయి.

ఆ అంచనాలను అందుకోవాలంటే పెద్ద దర్శకుడితో సినిమా చేయడమే కరెక్ట్.మహేష్ – వైట్ల మధ్య స్నేహం గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు.

ఆ రకంగా బావ కోసం వైట్లని సెట్ చేస్తున్నాడా మహేష్ ?

ఇందులో ఎంతవరకు నిజం దాగుందో తెలియదు కాని, ప్రస్తుతం సోషల్ మీడియా ఈ వార్త తరుచుగా కనబడుతోంది.శ్రీనువైట్ల ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నారు .మరి అది మహేష్ – సుధీర్ సినిమా కోసమేనా కాదా అనేది తెలియాలి !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube