పాపం .. ఎత్తు, ఫిగర్ చూసి శ్రీముఖిని కాదన్న టాప్ డైరెక్టర్

అనసూయ, రష్మీల తరువాత, మళ్ళీ అంతగా పాపులర్ అయిన కొత్తతరం యాంకర్ ఎవరు అంటే శ్రీముఖి అనే చెప్పాలి.ఈ 23 ఏళ్ళ చిన్నది మొదట సినిమాల్లో ప్రయత్నాలు చేసిన, ఎందుకో పెద్దగా సక్సెస్ లభించక టీవి రంగంలోకి అడగుపెట్టి, అక్కడ మాత్రం పిచ్చి పాపులారిటి సంపాదించేసింది.

 Sreemukhi Lost That Offer Because Of Height And Figure?-TeluguStop.com

ఆ ఫాలోయింగ్ తోనే మళ్ళీ తనవద్దకి సినిమా అవకాశాలు వచ్చేలా చేసుకుంది.శ్రీముఖి నటించిన బాబు బాగా బీజీ త్వరలోనే విడుదల కాబోతుండగా, రచయిత హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్న ఓ లేడి ఓరియెంటెడ్ చిత్రంలో శ్రీముఖే ప్రధాన పాత్ర పోషిస్తుండటం విశేషం.

ఇదిలా ఉంటే, ఒక మెగా హీరో సరనస, ఓ మెగా ఫ్యామిలి సినిమాలో కనబడే అవకాశం తృటిలో కోల్పోయిందట శ్రీముఖి.అందుకు కారణం ఆమె ఎత్తు, ఫిగర్ అంట.అసలేం జరిగింది, త్వరగా చెప్పండి అని అంటున్నారా ? వరుణ్ తేజ్ నటిస్తున్న మిస్టర్ చిత్రంలో శ్రీముఖి చేత ఒక ఐటమ్ సాంగ్ చేయించాలనుకున్నాడట దర్శకుడు శ్రీనువైట్ల.కాని ఇప్పుడు ఆ అవకాశం బాహుబలిలో ఐటం సాంగ్ చేసిన ఓ మోడల్ కి వెళ్ళిపోయింది.

ఇలా జరగడానికి కారణం, వరుణ్ తేజ్ హైట్ కి, శ్రీముఖి హైట్ కి మధ్య ఉన్న వ్యత్యాసం.

వరుణ్ పక్కన శ్రీముఖి మరీ పొట్టిగా అనిపిస్తుంది అని, అందులోనూ శ్రీముఖి కాస్త బొద్దుగా ఉంటుంది కాబట్టి, శ్రీముఖి మీద పునరాలోచనలో పడి, మొత్తానికి ఈ యాంకర్ ని తీసేసి ఆ మోడల్ ని తీసుకొచ్చారు.

ఈ హైట్, ఫిగర్ విషయాలు పక్కనపెడితే, అదే పాటని శ్రీముఖి చేసుంటే, ఆ క్రేజ్ వేరే ఉండేది.కాదంటారా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube