శ్రీముఖి ఏంటి .. ఇంత పెద్ద షాక్ ఇచ్చింది?

ఈమధ్య టీవి యాంకర్స్ అంతా అల్ట్రా గ్లామరస్ గా కనబడుతోంటే, శ్రీముఖి మాత్రం కాస్త డిఫరెంట్.లెక్కలు చూసుకోని కాస్ట్యుమ్స్ వేసుకుంటుంది.

 Sreemukhi Disappoints About Skin Show-TeluguStop.com

పెద్దగా స్కిన్ షో చేయదు.అలాంటి శ్రీముఖి శ్రీనివాస్ అవసరాల చేస్తున్న బాబు బాగా బిజీ సినిమా ఒప్పుకోగానే అంతా షాక్ అయ్యారు.

ఇలాంటి అడల్ట్ సినిమాని ఈ టీవి యాంకర్ ఎలా ఒప్పుకుందా అని.

ఎందుకంటే ఈ సినిమా హిందీలో వచ్చిన హంటర్ కి రీమేక్.దాదాపుగా బూతు సినిమాల ఉంటుంది.తెలుగులో శ్రీముఖి కూడా ఉంది అనేసరికి శ్రీముఖి ఈ సినిమాలో బోల్డ్ గా నటించే ఉంటుందని ఊహించారు అంతా.మొట్టమొదటి సారి శ్రీముఖి హద్దులు దాటబోతోందని ఆశించారు అభిమానులు.కాని అలాంటివేమి ఊహించుకోవద్దని గాలి తీసేసింది శ్రీముఖి.

బాబు బాగా బీజీ హంటర్ కి రీమేక్ అయినా, ఇందులోనూ కొన్ని “ఏ” రేటేడ్ సన్నివేశాలు ఉన్నా, తను మాత్రం అలాంటి సీన్స్ ఏమి చేయలేదని, తన పాత్ర చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుందని, ఎటువంటి హద్దులు దాటలేదని చెప్పింది శ్రీముఖి.మొదట ఈ అడల్ట్ సినిమాని చేయాలా వద్ద అని ఆలోచించినా, తన పాత్ర మీద ఎలాంటి అశ్లీల సన్నివేశాలు రాయకపోవడం వలనే సినిమా చేసానని, హంటర్ తో పోల్చుకుంటే ఇందులో మసాలా డోసు తక్కువే అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీముఖి.

నిన్న విడుదలైన బాబు బాగా బిజీ ట్రైలర్ లో కూడా శ్రీముఖి మీద ఎలాంటి మసాలా సన్నివేశాలు లేవు.కాని తేజస్వి మాడివాడ, సుప్రియ ఐసోలాతో మాత్రం అవసరాల బాగా రోమాన్స్ పండించినట్టు ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube