Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

స్పైడర్ ఆ సినిమాకు కాపిలా ఉందిగా -Spyder Plot Is Copied From This English Film ?

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా స్పైడర్. ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారి బడ్జెట్ ద్విభాష చిత్రం యొక్క టీజర్ నిన్న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా విడుదలయ్యి విశేష ఆదరణ రాబట్టుకుంది. ఇటు తెలుగులో, అటు తమిళంలో, మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి కొత్త రికార్డులు సృష్టించింది. కాని స్పైడర్ టీజర్ అంచనాలను అందుకుందా అంటే లేదనే చెప్పాలి. టీజర్ కట్ బాగా లేదని అభిమానులే పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమా ఓ ఫేమస్ హాలివుడ్ సినిమాకి కాపి లేదా స్ఫూర్తి తీసుకున్నట్లుగా ఉంది.

క్రిస్టోఫర్ నోలాన్ సినిమాలని బాగా ఫాలో అవుతారు మురుగదాస్. ఎంతలా అంటే ఆ దర్శకుడి సినిమాలని కాపి కొట్టేంత. అప్పట్లో కొత్త కాన్సెప్ట్ అంటూ అందరు నెత్తిన పెట్టుకున్న గజినీ క్రిస్టోఫర్ నోలాన్ తీసిన మెమెంటో సినిమా నుంచి స్ఫూర్తి పొందినది. ఇప్పుడు మళ్ళీ అదే క్రిస్టోఫర్ నోలాన్ తీసిన బ్యాట్ మెన్ బిగిన్స్ సినిమాని స్పూర్తిగా తీసుకున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

అందులో విలన్ క్యారక్టర్ స్కేర్ క్రో క్యారక్టర్ ఆజ్ ఇట్ ఈజ్ దింపేశారు మురుగదాస్. ఎస్ జే సూర్య గెట్ అప్ కూడా అలానే ఉంది టీజర్ మొదటి డైలాగ్ లో. బయో టెర్రరిజం మీద ఆధారపడి ఉన్న ఈ సినిమాలో ఎదో వైరస్ జనాల్ని పట్టి పీడించేలా ఉంది. బ్యాట్ మెన్ బిగిన్స్ లో కూడా అంతే. ఇప్పటివరకు టీజర్ లో వదిలిన క్లూస్ ప్రకారమైతే ఇలానే అనిపిస్తున్నా, అప్పుడే దీన్ని కాపి అనడం సమంజసం కాదేమో. మరో 15 రోజుల్లో ట్రైలర్ రాబోతోంది. అప్పుడైతే కరెక్ట్ ఐడియా వచ్చేస్తుంది.

ఎన్వీ ప్రసాద్ 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రకుల్ ప్రీత్ కథానాయిక. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది స్పైడర్.

Continue Reading

Trending…

To Top