స్పైడర్ పాట అక్కడినుంచే లేపేసారా ?

మీకు తెలుసో తెలియదో కాని సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ ఉంది‌.మ్యూజిక్ సిట్టింగ్ మొదలవగానే దర్శకులు కొన్ని ఇంగ్లీష్, కొరియన్, స్పానిష్ ఇలా అర్థం కాని భాషల్లోని పాటలతో వాలిపోతారు.

 Spyder Boom Boom Song Copied From This Song ?-TeluguStop.com

ఆ పాటలు మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో పెట్టి, ఇదిగో రిఫరెన్సు, నాకు ఇలాంటి ట్యూన్స్ కావాలి అంటాడు దర్శకుడు.కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మక్కీ టూ మక్కీ వాటిని దింపెస్తారు.

అసలేమాత్రం మార్పులు చేయరు.మరికొందరు ఆ పాటలకు మార్పులు చేసి దాన్నే ఇంకో ట్యూన్ లా కడతారు‌.

స్పైడర్ కి హరీస్ జయరాజ్ రెండొవ టెక్నిక్ వాడాడేమో.

నిన్న స్పైడర్ సినిమాలోని మొదట పాట విడుదలైన విషయం మీకు తెలిసిందే.

బూమ్ బూమ్ అంటూ సాగిన ఈ పెప్పి నంబర్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఎదో ఇంగ్లీష్ ఆల్బమ్ పాటలా ఉందని, మాస్ జనాలకి ఎక్కదని కొందరు అభిమానులు బాధపడుతోంటే, ఒక స్పై సినిమాలో మాస్ గా డప్పులు కొట్టరు కదా అంటూ మరికొందరు అభిమానులు సర్దీ చెబుతున్నారు.

ఇక ఇంగ్లీష్ పాటలకి అలవాటుపడి, కొత్తరకం పాటలను ఇష్టపడేవారికి ఈ పాట బానే ఉంది.కాని ఒక కంప్లయింట్‌.

ఈ పాటను పూర్తిగా మక్కీ టూ మక్కీ కాకపోయినా, కొంతవరకు ఓ ఇంగ్లీష్ పాట నుంచి లేపేసారని అంటున్నారు ఇంగ్లీష్ మ్యూజిక్ లవర్స్.లేపేయడం అనేది పెద్ద పదం అయితే, ఇన్స్పిరేషన్ పొందారు అందాం.

ఫిప్త్ హార్మోని కంపోజ్ చేసిన Reflection అల్బమ్ ఇక్కడ ఎంతమందికి తెలుసో కాని అందులో Baby I’m worth it అంటూ సాగే ఓ పెప్పి నంబర్ ఉంటుంది‌.బిలియన్ల కొద్ది హిట్స్ సంపాదించిన ఈ పాట చాలా అంటే చాలా ఫేమస్.

ఆ పాట ఓసారి వినండి, కాపి కాకపోయినా, స్పూర్తి ఖచ్చితంగా పొందారని మీకు కూడా అనిపించవచ్చు.మహేష్ ని ఇంట్రోడ్యూస్ చేసే ఈ పాటను తమిళంలో మధు కార్కీ రచించగా, తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాసారు.

అన్నట్లు స్పైడర్ నార్త్ అమెరికా హక్కులు 15.50 కోట్లకు అమ్ముడుపోగా, టోటల్ ఓవర్సీస్ హక్కులు ఏకంగా 23.50 కోట్లకు మినిమం గ్యారంటీ బేస్ మీద అమ్మారు‌.ఇది చాలా పెద్ద తేడాతో కొత్త నాన్ బాహుబలి రికార్డు.

ఇక స్పైడర్ టీజర్ మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగష్టు 9న విడుదల కానుండగా, సినిమా దసరా కానుకగా సెప్టెంబరు 27న తెలుగు, తమిళం, హిందీ, మళయాల భాషల్లో విడుదల కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube