బాలివుడ్ కి, దక్షిణాదికి మధ్య తేడాలు చెబుతున్న కాజల్

అందాల తార కాజల్ అగర్వాల్ బాలివుడ్ లో తన అదృష్టాన్ని తిరిగి పరీక్షించుకుంటోంది .రణదీప్ హూడా హీరోగా కాజల్ నటించిన “దో లఫ్జోన్ కి కహాని ” నిన్నే విడుదలైంది.

 South Fans Are Loyal Than Bollywood Fans – Kajal Agarwal-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో బాగానే కష్టపడింది కాజల్.డజనుకి పైగా ఇంటర్వ్యులు ఇచ్చింది.

ఒక ఇంటర్వ్యులో తన అభిమానుల గురించి మంచి మాటలు చెప్పింది ఈ భామ.బాలివుడ్ ఫ్యాన్స్ కి, దక్షిణాది ఫ్యాన్స్ కి మధ్య తేడా కూడా చెప్పుకొచ్చింది.

” దక్షిణాదిలో అభిమానులు చాలా లోయల్ గా ఉంటారు.ఒకటి రెండు సినిమాలు అపజయం పాలైనా, పరిస్థితులు బాగా లేకున్నా, తమకు ఇష్టమైన స్టార్ ను వీడరు.

బాలివుడ్ లో అలా కాదు.ఇక్కడి అభిమానులు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయితే రూటు మార్చేస్తారు.

దక్షిణాదిలో ఎదిగిన హీరోయిన్ ని కాబట్టి అక్కడి సినిమాలు అంటే సహజంగానే కొంచెం ఎక్కువ ఇష్టం.కాని బాలివుడ్, టాలివుడ్ లో ఒక్కటి ఎన్నుకోవాలంటే మాత్రం కష్టం ” అంటూ ముగించింది కాజల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube