భయపెట్టేసారు అంటున్న భామ

సోనమ్ కపూర్ మరోసారి సంచలన వాఖ్యలు చేసింది.పేరు తీసుకోని చెప్పకపోయినా బిజేపి వైఖరిని తప్పుపట్టింది.

 Sonam Supports Aamir And Sharukh-TeluguStop.com

ఇంతకి హీరోయిన్ కి రాజకీయపార్టీకి ఏంటి సంబంధం అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు సోనమ్ ఫ్యాన్ అయితే గనుక భయపడకండి … సోనమ్ బీజేపితో ఎలాంటి గొడవ పెట్టుకోలేదు.నటులు ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లను సపోర్టు చేసిందంతే.

అసహనంపై ఆమీర్ , షారుఖ్ చేసిన వాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.షారుక్ సినిమా దిల్వాలే సమయంలో బిజేపి అనుబంధ సంస్థలు ఆటంకాలు కలిగిస్తే, ఆమీర్ ని ప్రభుత్వ సంబంధిత ప్రచారల నుంచి తొలగించింది ప్రభుత్వం.దీన్నీ సోనమ్ తీవ్రంగా ఖండించింది.

” ఆమీర్ , షారుఖ్ ని దూషిస్తూ దేశంలో అసహనం నిజంగానే ఉందని రుజువు చేసి, వాళ్ళ అభిప్రాయం నిజమే అని చాటిచెప్పారు.అసలు వారికి మాట్లాడే హక్కు లేదా? వాళ్ళు ఒకటంటే మిడియా మరొకటి ప్రచారం చేసింది.సినిమాలు ఆపేస్తామని, దేశం విడిచి వెళ్ళిపొమ్మని భయపెట్టేసారు వారిని.

మళ్ళి ఏ సమస్యపై అయినా స్పందించడానికి వాళ్ళు ముందుకు రాకపోవచ్చు.ఇది నిజంగా సిగ్గుచేటు.” అంటూ చెప్పుకొచ్చింది సోనమ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube