నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రంలో ఒక హీరోయిన్గా అంజలి నటించగా మరో హీరోయిన్గా సొనాల్ చౌహాన్ నటించిన విషయం తెల్సిందే.ఈ ఇద్దరు హీరోయిన్స్‌లలో సొనాల్ చౌహాన్ ఈ సినిమాలో తన అంద చందాలతో హీటెక్కించబోతున్నట్లుగా ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది.
‘పండగ చేస్కో’ చిత్రంలో బికినీ వేసినా కూడా ఈ అమ్మడికి అంతగా క్రేజ్ రాలేదు.అయినా కూడా మరోసారి బాలయ్య కోసం తన హాట్ హాట్ అందాలను విందు చేసేందుకు సిద్దం అయ్యింది.
తాజాగా విడుదలైన ట్రైలర్లోనే దుమ్ము రేపిన సొనాల్ పూర్తి సినిమాలో మరింతగా ఆకట్టుకోవడం ఖాయం అని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.
సొనాల్ చౌహాన్ ఇప్పటికే ‘లెజెండ్’ చిత్రంలో బాలయ్యకు జోడీగా నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాలో సొనాల్ ఒక మోస్తరుగా తన అందాలను విందు చేసింది.ఆ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది.
తాజాగా ఈమె మరోసారి బాలయ్యతో సందడి చేయబోతుంది.దాంతో మళ్లీ ఈ సినిమా సైతం సక్సెస్‌ను దక్కించుకోవడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.
ఈ సినిమా సక్సెస్ అయితేనే సొనాల్ చౌహాన్‌కు టాలీవుడ్లో కెరీర్ ఉంటుంది.ఆ విషయం తెలిసే ఈ అమ్మడు ఇలా హాట్ అందాలను విందు చేసినట్లుగా సినీ వర్గాల వారు అంటున్నారు.
మరి ‘డిక్టేటర్’ సొనాల్కు మరిన్ని అవకాశాలు తెచ్చి పెట్టేనా చూడాలి.