మెగా హీరోల్లో నెం.1 బన్నీ!!

మెగా స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’.ఈసినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

 S/o Satyamurthy Collected 1million Dollars In Overseas-TeluguStop.com

విడుదల రోజే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.అయినా కూడా మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి.

భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్‌లో దూసుకు పోతుంది.కేవలం మూడు రోజుల్లోనే మిలియన్‌ డాలర్ల మార్క్‌ను క్రాస్‌ చేసిన సత్యమూర్తి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

మెగా ఫ్యాన్స్‌ను సైతం షాక్‌ అయ్యేలా ఈ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి.

ఇప్పటి వరకు మహేష్‌బాబుకు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌ ఉంది.

ఆ తర్వాత స్థానంలో అల్లు అర్జున్‌ ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాతో నిలిచాడు.మెగా హీరోల్లో ఏ హీరో కూడా సాధించని కలెక్షన్స్‌ను అల్లు అర్జున్‌ దక్కించుకుంటున్నాడు.

గత కొంత కాలంగా ఓవర్సీస్‌ మార్కెట్‌లో సత్తా చాటాలని తెగ ఆరాటపడుతున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా అందుకోలేక పోయిన రికార్డును సొంతం చేసుకున్నాడు.సత్యమూర్తి సినిమా మూడు రోజుల్లో ఏకంగా మిలియన్‌ డాలర్లను సొంతం చేసుకున్నట్లుగా ట్రేడ్‌ విశ్లేషకులు అంటున్నారు.

లాంగ్‌ రన్‌లో ఈ సినిమా రెండు మిలియన్‌ డాలర్లను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూషన్‌ రైట్స్‌ సొంతం చేసుకున్న నిర్మాతలు అంటున్నారు.దాంతో ఓవర్సీస్‌లో నెం.1 మెగా హీరోగా బన్నీ నిలవనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube