మనోజ్‌ పెళ్లిలో కొందరు మిస్సింగ్‌

అంగరంగ వైభవంగా జరిగిన మంచు వారి ఇంట పెళ్లికి తెలుగు సినిమా పరిశ్రమ నుండే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమా పరిశ్రమల ప్రముఖులు సైతం వచ్చారు.ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేశారు.

 Some Celebs Missing In Manchu Manoj Eedding-TeluguStop.com

ఇంత అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో కొందరు కనిపించక పోవడం చర్చనీయాంశం అయ్యింది.పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమంలో చిరంజీవి హాజరు అయ్యాడు.

అయితే పెళ్లిలో మాత్రం చిరు కనిపించలేదు.చిరుతో పాటు నాగబాబు మరియు చరణ్‌, అల్లు అర్జున్‌ ఇతరులు కనిపించలేదు.

మెగా ఫ్యామిలీ నుండి ఒక్క పవన్‌ తప్ప మరే హీరో కూడా పెళ్లికి హాజరు కాలేదు.

ఇక మంచు వారి పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ హీరోలు కూడా రాలేదు.

ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఏ కార్యక్రమంకు అయినా హాజరు అవుతాడు.కాని ఈ పెళ్లికి మాత్రం రాలేదు.

ప్రస్తుతం నాగార్జున స్పెయిన్‌లో అఖిల్‌ మూవీ షూటింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక్కడ ఉంటే తప్పకుండా పెళ్లికి వచ్చే వాడని కొందరు అంటున్నారు.

కొన్ని రోజుల ముందే ముంచు లక్ష్మి నిర్మించిన ‘దొంగట’ సినిమాలో కనిపించిన నాగార్జునతో మంచు ఫ్యామిలీకి ఎలాంటి విభేదాలు లేవని సినీ వర్గాల వారు అంటున్నారు.ఇంకా కొందరు స్టార్‌ హీరోలు మరికొందరు దర్శకులు కూడా ఈ వివాహ కార్యక్రమంలో మిస్‌ అయ్యారు.

ఎవరి కారణాలు వారికి ఉంటాయి అని కొందరు అనుకుంటుంటే, మరి కొందరు మాత్రం మంచు వారితో విభేదాల వల్ల ఏమైనా రాకుండా ఉండవచ్చా అని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube