అక్కినేని హీరో నాగార్జున ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమాతో పాటు కార్తీతో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ రెండు సినిమాలు కూడా నాగార్జున కెరీర్లో చాలా ముఖ్యం.‘మనం’ సినిమా తర్వాత నాగార్జున సినిమాల ఎంపిక పద్దతినిప పూర్తిగా మార్చుకున్నాడు.
వయస్సుకు తగ్గ పాత్రలతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు.అందులో భాగంగానే ఈ రెండు సినిమాల్లో నటించాడు.
ఈ రెండు సినిమాల్లో మొదటిది ‘సోగ్గాడే చిన్ని నాయనో’.ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.
పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమాను నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా చెప్పుకొచ్చారు.త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందేమో చూడాలి.
ఇక ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ కార్యక్రమాల్లో ఉంది.లావణ్య త్రిపాఠి మరియు రమ్యకృష్ణలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.