ఆగస్టులో సోగ్గాడు?

అక్కినేని హీరో నాగార్జున ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమాతో పాటు కార్తీతో మల్టీస్టారర్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 Soggade Chinni Nayana Release On Nagarjuna Birthday-TeluguStop.com

ఈ రెండు సినిమాలు కూడా నాగార్జున కెరీర్‌లో చాలా ముఖ్యం.‘మనం’ సినిమా తర్వాత నాగార్జున సినిమాల ఎంపిక పద్దతినిప పూర్తిగా మార్చుకున్నాడు.

వయస్సుకు తగ్గ పాత్రలతో నాగార్జున ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు.అందులో భాగంగానే ఈ రెండు సినిమాల్లో నటించాడు.

ఈ రెండు సినిమాల్లో మొదటిది ‘సోగ్గాడే చిన్ని నాయనో’.ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించనున్నాడు.

పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.కొత్త దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సోగ్గాడే చిన్ని నాయనో’ సినిమాను నాగార్జున పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆగస్టులో ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెప్పుకొచ్చారు.త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందేమో చూడాలి.

ఇక ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ కార్యక్రమాల్లో ఉంది.లావణ్య త్రిపాఠి మరియు రమ్యకృష్ణలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube