టాలీవుడ్ మన్మథుడు నాగార్జున సోలో హీరోగా సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చేసింది.ఇప్పుడు ఆ కొరతలను ఏకంగా డబుల్ యాక్ట్‌తో తీర్చడానికి రెడీ అవుతున్నాడు.
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయనా విడుదలకు సిద్ధమవుతుంది.సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయాలని నిర్ణయించారు.
తండ్రి కొడుకులుగా నటిస్తున్న నాగార్జున ఇందులో హలో బ్రదర్ స్టయిల్ ఆఫ్ కామెడితో నవ్వించడానికి రెడీ అవతున్నాడట.తండ్రి పాత్ర ఆత్మ రూపంలో ఉంటుంది.
కొడుకు అమాయకుడైన డాక్టర్.తండ్రి నాగార్జునకు రమ్యకృష్ణ జంటగా నటిస్తే, కొడుకుతో లావణ్యత్రిపాఠి జంటగా కనపడుతుందట.
సినిమా చాలా బాగా రావడంతో సంక్రాంతి బరిలోకి దిగుతున్న నాగార్జున ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని డిసెంబర్ 27న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాల, తను నేను సినిమా నిర్మాత అయిన రాధామోహన్.
పి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.