ఆ సమస్య సూసైడ్ కి దారి తీస్తుంది

నాన్నకు ప్రేమతో సినిమాలో చెప్పినట్లు, ప్రతి చర్యకు ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది.నిద్ర సరిగా లేకపోతే ఏమవుతుంది? మనిషి చురుగ్గా ఉండలేడు.మనిషి చురుగ్గా ఉండకపోతే ఏమవుతుంది? ఏ పని సరిగా పూర్తి చేయలేడు.ఏ పని సరిగా చేయలేకపోతే ఎదగడం కష్టం.

 Sleeplessness Can Lead To Suicide Thoughts – Study-TeluguStop.com

ఎదగలేకపోతే నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి.నెగెటివ్ ఆలోచనలు పెరిగిపోతే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పుట్టుకొస్తాయి.ఉఫ్ … చాలామందికి ఇది విషయం కొద్దిగా అతిగా అనిపించవచ్చు కాని నిద్రలేమి కూడా సూసైడ్ కి దారితీస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది.

18 మందిపై జరిగిన ఈ అధ్యయనంలో మూడురకాల సమస్యలు బయటపడ్డాయి.ఒకటి, నిద్రలేమిని భరించలేక రాత్రిపూట ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి అనే ఆలోచనలు రావడం.రెండు, నిద్రలేమి వలన జీవితం కష్టంగా అనిపించడం, డిప్రేషన్ పెరిగిపోవటం, నెగెటివ్ ఆలోచనలు రావడం.మూడు, ఈ సమస్యలన్నీటికి చావు మార్గంలాగా కనిపించడం.

“కేవలం నిద్రలేమి వలనే చావుకి దగ్గరవుతున్నారని చెప్పలేం కాని, నిద్రలేమి జీవితంపై విరక్తి పుట్టడానికి ఒక బలమైన కారణం అని చెప్పవచ్చు.ఎందుకంటే కాసేపైనా మన సమస్యలని మర్చిపోయేలా చేస్తుంది నిద్ర.అదే లేకపోతే మానసిక క్షోభ మరింత పెరిగిపోతుంది.ఏ పని సరిగా చేయలేకపోతే అది మరింత నరకం.అందుకే నెగెటివ్ ఆలోచనలు పుట్టుకొచ్చి, ఆత్మహత్యే దీనికి మార్గం అనే నిర్ణయానికి వచ్చేస్తుంటారు కొంతమంది.

పనిఒత్తిడి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ సమస్య రాను రాను పెరిగిపోతోంది” అని డాక్టర్ రిక్మన్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube