ఆ అలవాటు వలన కూడా కిడ్నీలు ప్రమాదంలో -Sleeplessness Can Lead To Chronic Kidney Disease – Study 2 months

Sleep Disorders Sleeping Sleeplessness Can Lead To Chronic Kidney Disease - Study Photo,Image,Pics-

నిద్రలేమి ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది. చాలా పెద్దగా ఉండే ప్రమాదాల లిస్టులోకి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ (CKD) కూడా వచ్చి చేరింది. చికాగో లోని యునివర్సిటి ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు చేసిన స్టడీలో ఈ విషయాన్ని వెల్లడించారు. 432 యువతి యువకలపై కొంతకాలం పరిశోధన జరిపిన ప్రొఫెసర్స్, CKD తో ఇబ్బందిపడుతున్న వారి చేతికి ఓ ఎలక్ట్రానిక్ బ్యాండ్ తగిలించారు. ఆ బ్యాండ్ ద్వారా రోజుకి ఎవరు ఎంతసేపు నిద్రపోతున్నారో ట్రాక్ చేసేవారు.

అందులో తక్కువగా నిద్రపోయినవారు, అంటే 7 గంటలకి తక్కువ నిద్రతో రోజులు గడిపినవారిలో 70 మందిలో కిడ్నీకి సంబంధిచిన సమస్యలు పెరిగిపోగా, మరో 48 మంది ఏకంగా మృత్యువాత పడ్డారట. నిద్ర ఓ గంట పెరిగినా కొద్ది, CKD వచ్చే అవకాశం 19% తగ్గిపోతుందని ప్రొఫెసర్ అనా రికార్డో తెలిపారు.

ఆ ప్రొఫెసర్ ఇంకా మాట్లాడుతూ ” మన నిద్రకి కిడ్నీ పనితనానికి చాలా సంబంధం ఉంటుంది. మా రిసేర్చిలో ఇదే విషయం బయటపడింది. ఆయుష్షు క్షీణించే అతిపెద్ద కారణాలలో నిద్రలేమీ ప్రధానమైనది. క్రోనిక్ కిడ్నీ డిసీజ్ రావడానికి ఇదో పెద్ద కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన నిద్ర శరీరానికి ఇవ్వాలి.” అంటూ చెప్పుకొచ్చారు.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...గర్భిణీలకు ప్రశాంతమైన నిద్ర రావాలంటే ఎలా

About This Post..ఆ అలవాటు వలన కూడా కిడ్నీలు ప్రమాదంలో

This Post provides detail information about ఆ అలవాటు వలన కూడా కిడ్నీలు ప్రమాదంలో was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

Sleeplessness can lead to Chronic Kidney Disease - Study, Sleeplessness, Chronic Kidney Disease, Sleep disorders , Sleeping

Tagged with:Sleeplessness can lead to Chronic Kidney Disease - Study, Sleeplessness, Chronic Kidney Disease, Sleep disorders , SleepingChronic Kidney Disease,Sleep disorders,sleeping,Sleeplessness,Sleeplessness can lead to Chronic Kidney Disease - Study,,