దర్శకుడు బలవంతం చేస్తే పవన్ కళ్యాణ్ తో ఆ పని చేసిందట

నికిషా పటేల్ అంటే ఎవరో ఇక్కడ అందరికి తెలుసుగా? తెలియక పోయినా మీ తప్పేం లేదండి.పవన్ కళ్యాణ్ లాంటి అగ్రనటుడితో నటించిన కూడా జనాలకి అసలు గుర్తే లేని హీరోయిన్ తను.

 Sj Suryah Forced Me To Act With Pawan Kalyan – Nikesha Patel-TeluguStop.com

ఇదో విచిత్రం కదా! నికిషా పవన్ సరసన కొమరం పులిలో జోడి కట్టింది.యూకేలో పుట్టిపెరిగిన ఈ సుందరాంగికి అదే తొలి సినిమా.

కాని ఆ సినిమా తన ఇష్టంతో మాత్రం చేయలేదు అంటోంది నికిషా.ఇన్నేళ్ళ తరువాత, తన కెరీర్ ఎక్కడికి పోతోందో అర్థం కాని సమయంలో పాతరోజులు గుర్తొచ్చాయేమో … అసలు తనకి దక్షిణాది సినిమా మీద ఆసక్తి లేదని, బాలివుడ్ సినిమాతో ఎంట్రి ఇద్దామని అనుకున్నాను కాని ఎస్ జే సూర్య బాగా బలవంతం చేసేసరికి, పవన్ కళ్యాణ్ తో పని చేయడం వలన మరిన్ని అవకాశాలు వస్తాయేమో అని ఆశతో ఆ సినిమా చేసాను తప్ప, ఇష్టంతో మాత్రం కాదని చెప్పింది నికిషా.

అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తనకు అవకాశాలు రాలేదని వాపోయింది.కొన్నిరోజులు కన్నడ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసిన నికీషా, ఇప్పుడు ఒకటిరెండు చిన్నచితక సినిమాలతో బండి నెట్టుకొస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube