ఈసారి రమ్యకృష్ణ

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఇప్పటికే షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసిన జక్కన్న ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుతున్నాడు.

 Rajamouli To Reveal Ramya Krishna’s Poster-TeluguStop.com

మరో వైపు ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాడు.ఈ నెలంతా కూడా రోజు విడిచి రోజు సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేస్తానంటూ ప్రకటించిన జక్కన్న ఇప్పటికే మూడు పోస్టర్లను విడుదల చేసిన విషయం తెల్సిందే.

ఆ మూడు కూడా సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లాయి.ఇక రేపు నాల్గవ పోస్టర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

‘బాహుబలి’ సినిమాలో రమ్యకృష్ణ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.శివగామిగా రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించనుంది.

ఈమె లుక్‌ ఇప్పటి వరకు బయటకు వచ్చింది లేదు.రేపు శివగామి లుక్‌ను రివీల్‌ చేయబోతున్నట్లుగా రాజమౌళి ప్రకటించాడు.

ఈ సినిమాలో బాహుబలికి తల్లిగా శివగామి కనిపించే అవకాశాలున్నాయని అంటున్నారు.రాజమాతగా రమ్యకృష్ణ కనిపించనుంది.

ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉండగా, శివగామి లుక్‌ రివీల్‌ అయిన తర్వాత మరింత పెరుగుతాయేమో చూడాలి.భారీ బడ్జెట్‌తో శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు నిర్మిస్తున్నారు.

మే 31న ట్రైలర్‌ జులై 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube