‘బ్రహ్సోత్సవం’లో సునీత?

టాలీవుడ్‌లో సునీతకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెల్సిందే.పాటలు పాడటంతో పాటు, డబ్బింగ్‌తో కూడా తన కంటూ ప్రత్యేక శైలిని కలిగి ఉన్న సునీతను వెండి తెరపైకి తీసుకు వచ్చేందుకు పలువురు నిర్మాతలు మరియు దర్శకులు సైతం ప్రయత్నించారు.

 Singer Sunitha In Mahesh’s Brahmotsavam..?-TeluguStop.com

కాని నటనపై ఆసక్తి లేక పోవడంతో ఇప్పటి వరకు వెండి తెరకు దూరంగా ఉంటూ వచ్చింది.తాజాగా ఈమె నటించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే ఈమె వెండి తెరపై తళుక్కున మెరిసే అవకాశాలున్నాయి.

మహేష్‌బాబు సినిమాలో సునీత ఒక ముఖ్య పాత్రకు ఎంపిక అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఈమె మహేష్‌బాబుకు సోదరిగా నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాను వచ్చే నెలలో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మహేష్‌ సినిమాలో నటించే అవకాశం రావడంతో సునీత ఓకే చెప్పినట్లుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube