బర్న్‌ చేసేందుకు సిద్దమయ్యాడు

‘హృదయ కాలేయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సులు దోచుకుని బర్నింగ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు సంపూర్నేష్‌బాబు.ఈయన మొదటి సినిమాతోనే అశేష అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

 Singam 123 Promotional Song Release On April 8th-TeluguStop.com

ఆ సినిమా తర్వాత ఈయన పలు సినిమాల్లో కామెడీ పాత్రల్లో కనిపించాడు.అయితే హీరోగా ఈయన రెండవ సినిమా ‘సింగం 123’ రెడీ అవుతోంది.

ప్రముఖ హీరో మంచు విష్ణు నిర్మిస్తున్న ‘సింగం 123’ ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుపుకుంటుంది.ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటి నుండే చేయాలని విష్ణు భావిస్తున్నాడు.

ఈనెల 8న ‘సింగం 123’ ప్రమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేయాలని మంచు విష్ణు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.సినిమా మొత్తం ఆద్యంతం నవ్వులతో ఉంటుందని, ఈ సినిమా కథలో మంచు విష్ణు కూడా వేలు పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ సినిమాతో సంపూర్నేష్‌బాబు మరోసాని ప్రేక్షకులను కడుపు చేత పట్టుకుని నవ్వేలా చేస్తాడని నిర్మాత మంచు విష్ణు అంటున్నాడు.అజయ్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంపూర్నేష్‌బాబు పోలీస్‌గా కనిపించనున్నాడు.

దాదాపు 25 సినిమాలకు ఇది పేరడీగా ఉంటుందని దర్శకుడు అజయ్‌ శర్మ చెప్పుకొచ్చాడు.మరి ఈ సినిమాతో మరోసారి బర్నింగ్‌స్టార్‌ ప్రేక్షకులను బర్న్‌ చేస్తాడేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube