లివర్ ప్రమాదంలో ఉన్న విషయాన్ని ఎలా గుర్తించాలి ?

మన శరీరంలోని అతిముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి.మనం తినే ఆహారం జీర్ణం కావడానికి లివర్ కావాల్సిందే.

 Signs In A Body That Speak About Liver Damage-TeluguStop.com

డైజెస్టీవ్ ట్రాక్ నుంచి వస్తున్న రక్తాన్ని ఫిల్టర్ చేసి మిగితా భాగాలకు అందించాలన్నా లివర్ కావాల్సిందే.లివర్ లేనిదే మన మెటాబాలిజం లేదు.

అంటే లివర్ లేనిదే జీవితం లేదు.అందుకే లివర్ ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఎలాంటి సమస్య వచ్చినా త్వరగా పసిగట్టి నయం చేసుకోవాలి.మరి లివర్ ప్రమాదంలో ఉందని ఎలా గుర్తించాలి? లివర్ తన పనితాన్నాన్ని ఆపేముందు ఎలాంటి గుర్తులు చూపిస్తుంది?

* మూర్ఛ వచ్చినట్లు అవుతుంది.ఊరికే అలసిపోతారు.ఇలా జరగడానికి కారణం రక్తంలో చేరిన టాక్సిన్సే.లివర్ సరిగా ఒనిచేయక, టాక్సిన్స్ ని సరిగా క్లియర్ చేయలేదు.

* వాంతులు విపరీతంగా జరగొచ్చు.

కడుపులో నొప్పితో కూడా వాంతులు వస్తాయి.ఇది కూడా టాక్సిన్స్ వలన జరుగుతుంది.

* సరిగా అకలి వేయదు.ఆకలిగా అనిపించినా, ఏమి తినలేని పరిస్థితి.

లివర్ సరిగా పనిచేయక బైల్ సరిగా విడదల కాక, ఫ్యాట్స్ అలాగే ఉండిపోయి, ఆకలి వేయదు.

* విపరీతమైన దురద మొదలవుతుంది.

అలాంటి ఇలాంటి దురద కాదు, గోర్లు వాడి వాడి నరాలు బయటకి కనిపించేంత దురద.

* మోషన్స్ జరగొచ్చు.

అలాంటి ఇలాంటి మోషన్స్ కాదు, మలంలో రక్తం బయటకి రావొచ్చు.ఇంటెస్టినల్ బ్లీడింగ్ వలన ఇలా జరుగుతుంది.

* లివర్ పాడైపోతుండటం వలన రక్తంలో బిలిరూబిన్ పెరిగిపోతుంది.దాంతో విపరీతమైన జ్వరం రావొచ్చు.

కొందరికి జాండైస్ వస్తుంది.

* మలం యొక్క రంగు కూడా మారొచ్చు.

బైల్ ప్రొడక్షన్ సరిగా లేకపోవటంతో మలం యొక్క రంగు రకరకాలుగా మారుతుంది.పేల్ యెల్లో, గ్రే .ఇలా వివిధ రంగులు.

* మూత్రం యొక్క రంగు కూడా మారిపోతుంది.

రక్తంలో బిలిరూబిన్ ఎక్కువ ఉండటం వలన మూత్రం డార్క్ కలర్స్ లో పడుతుంది.ఇది కూడా లివర్ సరిగా పనిచెయకే జరుగుతుంది.

* కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది.ముఖ్యంగా కుడి వైపు, లివర్ అధికభాగం ఉండేవైపు బాగా నొప్పి వేస్తుంది.

ఊపిరితిత్తుల దాకా ఈ నొప్పి ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube