కమల్ హాసన్ ముద్దుల తనయ శృతిహాసన్ ఒకేసారి మూడుభాషల్లో టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది.గ్లామర్ కి గ్లామర్ పండిస్తూ, నటనలో కూడా అదరగొడుతూ, అగ్రకథానాయిక అనే ట్యాగ్ సంపాదించుకుంది.
మంచి సక్సెస్ రేట్ కూడా ఉన్న శృతితో నటించడానికి హీరోలంతా ఇష్టం చూపిస్తారు.అంతా బానే ఉంది కాని, శృతి ప్రవర్తనతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని బలమైన టాక్.
మధ్యాహ్నం అయితే కాని శృతి సెట్లోకి రావట్లేదట.దాంతో కాల్షిట్లు వృధా అవుతున్నాయి.
సినిమాలు తనవల్ల కూడా ఆలస్యమవుతున్నాయి.రెమ్యునరేషన్ చుక్కల్లో తీసుకొని, చుక్కలు చూపిస్తోందని వాపోతున్నారు కొందరు నిర్మాతలు.
స్టార్ కూతురితో పాటు, స్టార్ హీరోయిన్ కాబట్టి ఎవరు ఏమీ అనలేకపోతున్నారట.ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో అమ్మడే చెప్పాలి.
శృతి ప్రస్తుతం హిందీలో యారా, తెలుగులో ప్రేమమ్ రీమేక్, తమిళంలో సింగం 3 చిత్రాల్లో నటిస్తోంది.ఇవి కాకుండా, ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించనున్న సినిమాలో కూడా శృతిహాసనే హీరోయిన్.