నా బాడి అలా ఉండటం నా తప్పు కాదు అంటున్న శృతి హాసన్

శృతి హాసన్ మాటల గురించి కొత్తగా చెప్పేదేముంది, ముక్కుసూటిగా, చాలా బోల్డ్ గా మాట్లాడటం తనకి ఎప్పటినుంచో అలవాటు.ఓ మ్యూజిక్ డైరెక్టర్ తో ప్రేమలో పడి, బ్రేక్ అప్ చేసుకున్నానని ఒప్పేసుకుంది, నచ్చినవాడు దొరికితే పెళ్ళికి ముందే పిల్లల్ని కనేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

 Shruti Haasan Speaks Frankly About Her Body-TeluguStop.com

ఇలా ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే శ్రుతికి అలవాటు.ఇప్పుడు మళ్ళీ అలాంటి బోల్డ్ కామెంట్స్ చేసింది శృతి.

అది కూడా తన శరీరం మీద.మ్యాగజీన్లకు ఇచ్చే హాట్ ఫోటోషూట్, తన ముఖంలో వచ్చిన మార్పుల (సర్జరీ) మీద అడిగిన ప్రశ్నలకు శృతి ఇలా సమాధానమిచ్చింది.

” మీరు గూగుల్ లో ఏ ఇతర బాలివుడ్ నటి గురించి అయినా చూడండి.అందరు అలాంటి ఫోటోషూట్స్ చేసినవారే.

(నవ్వుతూ) ఒకవేళ నా శరీరం మిగితావరి కంటే ఆకర్షణీయంగా అనిపిస్తే అది నా తప్పు కాదు.నాకు నా శరీరం పట్ల గర్వం ఉంది.

కొన్నిసార్లు అది పెర్ఫెక్ట్ గా కనిపిస్తుంది.కొన్ని సార్లు కనిపించదు.

నాకైతే హాట్ గా కనిపించడం అనేది మనిషి పెర్సానాలిటిలో ఒక లక్షణం మాత్రమే.నాకు నా శరీరం అంటే ఇష్టం.

ఇతరులకి దానిపై ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అనవసరం.నేను నా జీవితంతో, నా శరీరంతో ఏం చేసుకుంటాను అనేది నా ఇష్టం.

ఒకవేళ నా మీద ఎవరైనా కామెంట్ చేస్తున్నారు అంటే, వారు వారి జీవితంలో ఎదో కోల్పోయారు అందుకే నా జీవితం మీద ఆసక్తి ఉంది” అంటూ పెద్ద కామెంట్ చేసింది శృతి.

అన్నిటికి సూటిగా, నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చే శృతి ప్రస్తుతం తన రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటి అనే ప్రశ్నకు మాత్రం జవాబు ఇవ్వడం లేదు.

ప్రతీసారి దాటేస్తోంది.నేను ప్రశ్నకు జవాబు చెప్పను అంటోంది.

కాని శృతి ఇలా మౌనంగా ఉండటం వలనే లండన్ కి చెందిన మైకేల్ కోర్సాలేతో తను ప్రేమాయణం నడిపిస్తోందనే వార్తలు మాటిమాటికి మీడియాలో వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube