Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

ఫిగర్ సమస్య వల్లే శృతిహాసన్ ని వద్దనుకున్నారా?-Shruti Haasan Lost That Offer To Kiara Advani Because Of Her Figure?

Telugu Gossips

మామూలుగానైతే మహేష్ పక్కన నటించే హీరోయిన్లను ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ప్రిన్స్ గ్లామర్ ని తట్టుకోని నిలబడటం చాలా కష్టం. అపుడెప్పుడో సొనాలి బింద్రే, ఆమధ్యలో కాజల్ అగర్వాల్ మాత్రమే మహేష్ లాంటి అందగాడికి సరైన్ జోడిగా అనిపించారు. వారి తరువాత ఒక హీరోయిన్ మహేష్ పక్కన సెట్ అయ్యింది అంటే అది శృతిహాసనే. శ్రీమంతుడు సినిమాలో వారి జోడి చక్కగా కుదిరింది. మళ్ళీ వీరిద్దరు ఓ సినిమా చేస్తే బాగుంటుంది అని ప్రేక్షకులకి కూడా అనిపించింది. అందుకే, ఈ జోడిని తిరిగి తన సినిమాతోనే కలపాలనుకున్నారట దర్శకుడు కొరటాల శివ. కాని ఆ అలోచన వదులుకున్నారు. ఎందుకంటారు?

భరత్ అనే నేను సినిమా కోసం ఎన్నో పేర్లను పరిశీలించారు కొరటాల. ముంబాయిలోని పెద్ద మోడల్స్ ని ఫిల్టర్ చేసారు. ఓ దశలో కీర్తీ సురేష్ ని ఫిక్స్ చేసుకుందామనుకున్నా, అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యేసరికి ఆ ఆలోచన కూడా వర్కవుట్ అవలేదు. బాలివుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానితో ఓ రెండు నెలలలుగా టచ్ లో ఉన్నా, ఎక్కడో కొరటాలకి శృతిహాసన్ మీద ఆసక్తి ఉండిందట. మహేష్ – శృతి సూపర్ హిట్ జోడి కావడంతో, కియారా కన్నా శృతి అయితనే బెటర్ అని భావించారట. కాని చివరకి బాలివుడ్ భామవైపే మొగ్గుచూపడాని కారణం శృతి హాసన్ ఫిగర్ అని తెలుస్తోంది.

ఇప్పటికే కాటమరాయుడులో చిత్రమైన కాస్ట్యూమ్స్, బరువు పెరిగిన బాడితో విమర్శల దెబ్బపడింది, మళ్ళీ ఇదో కొత్త దెబ్బ. శృతి జిమ్ లో కష్టపడుతోంది. కాని తను మళ్ళీ పాత షేప్ కి వచ్చేసరికి సమయం వృధా అవుతుంది, ఎందుకు రిస్క్ అని శృతిహాసన్ ని కొరటాల వద్దనుకున్నారని టాక్. పాపం శృతి … కాటమరాయుడు ఫలితం షాక్ అయితే, ఇది అంతకన్నా పెద్ద షాక్.

భరత్ అనే నేను రెగ్యులర్ షూట్ మే చివర్లో మొదలవుతుందట. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ పొలిటికల్‌ యాక్షన్ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu Gossips

 • Gossips

  Mega Fans Negative Talk on Baahubali

  By

  బాహుబ‌లి….బాహుబ‌లి…బాహుబ‌లి ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా వారి నోటి వెంట ఇదే మాట విన‌ప‌డుతోంది. తొలి పార్ట్ రూ.600 కోట్ల వ‌సూళ్లు,...

 • Gossips

  Nithin to lead Janasena in Telangana?

  By

  ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పరమభక్తుల్లో హీరో నితిన్ ఒకరు. ఇష్క్ సినిమా నుంచి మొదలు, పవర్...

 • Gossips

  Srinu Vaitla sold his house for clearing debts

  By

  అగ్రదర్శకుడు శ్రీనువైట్ల టైమ్ అస్సలు బాగాలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే ఆయన ఇంటికి వాస్తు బాగాలేదు. ఆగడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న సమయంలో...

 • Gossips

  Mahesh Babu as Lord Krishna in 1000cr Mahabharata?

  By

  వెండితెరపైకి మహాభారతం కథని తీసుకురావాలి .. ఇదే రాజమౌళి, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల డ్రీమ్ ప్రాజెక్టు. మరికొన్నేళ్ళ వరకు...

To Top