ఒకప్పుడు హీరోయిన్లు గ్లామరస్ గా ఉన్నా లేకున్నా పట్టించుకునేవారు కాదు.70-80 ల్లో వచ్చిన చాలామంది హీరోయిన్లు ఫిట్ గా ఉన్నా, లావెక్కినా కూడా అది పెద్ద మ్యాటర్ కాదు.కాని రాను రాను హీరోయిన్ల కష్టాలు పెరిగిపోయాయి.ఒక కొత్త హీరోయిన్ ని తెరకు పరిచయం చేసేముందు వందలకొద్దీ మోడల్స్ ఫోటోలు చూస్తున్నారు దర్శకులు.
ఆ ఒత్తిడి వల్లే తమలో ఒక్క వంక కూడా వెతక్కూడదని సర్జరీలు చేయించుకుంటారు మోడల్స్.మరి హీరోయిన్లుగా అల్రెడి సెటిల్ అయినవారికి ఈ కష్టాలు ఎందుకు? వారికి సర్జరీతో అవసరం ఎందుకు అంటే, పోటిలో నిలదొక్కుకోవాలంటే ఇవన్ని తప్పవు.ఇక శృతిహానన్ మూడొవ కాటగీరి.బ్యాంక్ గ్రౌండ్ ఉండి, సినిమాల్లోకి వస్తానని తెలిసి, సినిమాల్లో టాప్ హీరోయిన్ కావాలనే ధృఢనిశ్చయంతో సర్జరీ చేయించుకుంది.
శృతి మొదటి సినిమా లక్ (బాలివుడ్) చూసి, ఒక్కసారి తెలుగులో తన మొదటి సినిమా అనగనగా ఓ ధీరుడు చూడండి.తేడా మీకే అర్థమవుతుంది.
మిగితా భాగాల సంగతి ఏమో కాని, లిప్ సర్జరీ మాత్రం ఖచ్చితంగా చేయించుకుందని వాదిస్తారు సినీజనాలు.ఇన్నాళ్ళకు ఈ విషయం మీద తనదైన స్టయిల్లో స్పందించింది శృతి.
“ఇది నా ముఖం, నా శరీరం.నా శరీరంతో నేను ఏం చేసుకుంటాననేది ఎవరికి అవసరం లేని విషయం.
అలాగే నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ గట్టిగానే సమాధానమిచ్చింది శృతి.ఈ స్టేట్మెంట్ లో సర్జరీ చేయించుకున్నట్లు డైరెక్టుగా ఒప్పుకోకపోయినా, ఇండైరెక్టుగా అదే విషయాన్ని ఒప్పుకుంది ఈ కమల్ హాసన్ గారాలపట్టి.