హాట్ భామతో బాలయ్య చిందులు

బాలయ్య బాబు సినిమా అంటే మాస్ కి నచ్చే అంశాలు అన్ని ఉంటాయి.భారి యాక్షన్ సీక్వేన్స్ లకు బాలకృష్ణ ఎంత ఫేమసో , ఇద్దరేసి, ముగ్గురేసి హీరోయిన్లతో రొమాన్స్ చేయడంలోనూ అంతే ఫేమస్.

 Shraddha Das Turns Item Girl For Balakrishna-TeluguStop.com

బాలయ్య బాబు కేరీర్ ను గమనిస్తే ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉన్న సినిమాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి.

ఇప్పుడు కొత్తగా వస్తున్న డిక్టేటర్ లో కూడా అంతే.

అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష .ఇలా ముగ్గురు భామలతో రాబోతున్నాడు బాలయ్య.ఇందులో ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంది.బలకృష్ణ తో హాట్ భామ శ్రద్ధదాస్ చిందులేస్తోంది ఈ పాటలో.ప్రస్తుతం ఢిల్లీలో ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.మరో మూడు రోజులపాటు అక్కడే ఉంటారు.

ఆ తరువాత హైదరాబాదులో తీసే ఫైట్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందట.

శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్తాన్ని ఎరోస్ సంస్థ నిర్మిస్తోంది.

తమన్ స్వరపరిచిన పాటలు త్వరలోనే విడుదల అవుతాయి.ముందునుంచి చెప్తున్నట్లుగానే సంక్రాంతి బరిలో దిగుతాడు డిక్టేటర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube