అరటిపండ్లను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? ఓసారి ఇది చదవండి

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండటం ఏమో కాని, వంటగది వస్తువులన్నీ అందులోనే దాచేస్తారు.అంతేకాక, రకరకాల పండ్లు తీసుకొచ్చి దాంట్లోనే పెట్టేస్తారు.

 Why You Should’t Keep Bananas In Fridge ?-TeluguStop.com

పండ్లను ఫ్రిడ్జ్ లో పెడితే, అవి తాజాగా ఉంటాయనే నమ్మకం వారిది.అయితే అన్ని ఫలాలు ఒకేలా ఉండవుగా.

ముఖ్యంగా మనం ఎక్కువగా కొనుక్కొచ్చే అరటిపండుని కూడా ఫ్రిడ్జ్ లోనే దాచేయడం అలవాటు.కాని అది అలవాటు కాదు పొరపాటు.

అరటిపండుని ఫ్రిడ్జ్ లో పెట్టొద్దని సూచిస్తున్నారు నిపుణులు.పచ్చి అరటికాయని ఫ్రిడ్జ్ లో పెడితే అదే పండిపోతుంది అని అనుకునేవారు ఉన్నారు.

కాని ఫ్రిడ్జ్ లోని తక్కువ టెంపరేచర్ వలన అరటి సరిగా పండదు.అలాగే అరటి తన రుచిని కోల్పోతుంది.

అరటి పండడానికి ఎతేలిన్ అనే నేచురల్ గ్యాస్ అవసరం.దీన్ని స్వయంగా అరటి పండే విడుదల చేస్తుంది.

అలాంటప్పుడు అరటిని అరటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వలన ఎంజీమ్స్ దెబ్బతినటమే కాదు, సున్నితంగా ఉండే బనానలోని సేల్స్ కూడా దెబ్బతింటాయట.అందుకే పండిన అరటిని అప్పుడే తినేయటం, పండని అరటిని మామూలుగానే సీల్ చేయటం బెటర్ అని పరిశోధకుల మాట.మరో ముఖ్య విషయం, కొన్ని దేశాల్లో నమ్మినట్టుగా, అరటిపండుని ఫ్రిడ్జ్ లో పెడితే అది విషపూరితం అయిపోదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube