ఇప్పటికే క్లయ్ మ్యాక్స్ పార్టు షూటింగులో ఉన్న సర్దార్.త్వరలోనే విడుదల కానుంది.
ఏప్రియల్ 8న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అయిపోతుందని మొన్ననే నిర్మాత శరత్ మరార్ కన్ఫామ్ చేశాడు కూడా.ఈ తరుణంలో ఈ సినిమా గురించి పవన్ కు ఉన్న ఒక అభిప్రాయం ఏంటనేది తెలుస్తోంది.
ఈ సినిమా మొదట్లో.పవన్ ఒక పర్సనలైజ్డ్ కార్డు వేస్తున్నాడట.అదేంటంటే.”మూడేళ్ల నుండి నా సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం అంకితం” అంటూ సినిమాను మొదలుపెడతారట.
ఎప్పుడూ లేనిది కొత్తగా అభిమానులకు సినిమాల అంకితం ఏంటి? ఇంతకుముందు కూడా ఇలా భారీ గ్యాపులు చాలాసార్లు తీసుకున్నాడే!! కొంపతీసి అలా అంకితం ఇచ్చేసి ఇదే లాస్టు సినిమా అంటాడా అనుకుంటే.మొన్ననేగా ఒక ఇంటర్యూలో చెప్పాడు.
తాను మనుగడ కొనసాగించాలంటే ఇంకొన్ని సినిమాలు చేయక తప్పదని.