పరుగు సినిమాలో ఓ చిన్న రోల్లో కనిపించి ఇప్పుడు అతను కనిపిస్తే కడుపుబ్బా నవ్వులే అన్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు సప్తగిరి.కెరియర్ మంచి ఊపు మీద ఉన్న ఈ టైంలో మరో మెట్టు ఎక్కి హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు.
సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ సప్తగిరి లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను అరుణ్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే సప్తగిరి అందించడం విశేషం.
ఇక్కడ షాక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 6 కోట్లట.మరి సప్తగిరితో 6 కోట్లంటే అది మాములు విషయం కాదు.
దాదాపు ఓ యావరేజ్ హీరో బడ్జెట్ తో సినిమా చేస్తున్న సప్తగిరి ఈ సినిమా రిజల్ట్ మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు.సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్న సప్తగిరి కచ్చితంగా కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటున్నాడు.
మరి సప్తగిరి చేసే ఆ కామెడీ ఎక్స్ ప్రెస్ ఏమేరకు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.