నంద‌మూరి హ‌రికృష్ణ - ల‌క్ష్మీపార్వ‌తికి షాక్‌

దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు నంద‌మూరి తార‌క రామారావు స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి, ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి హ‌రికృష్ణ‌కు ఈసీ షాక్ ఇచ్చింది.వీరిద్ద‌రు గ‌తంలో ఏర్పాటు చేసిన రాజ‌కీయ పార్టీల‌ను ర‌ద్దు చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.1995లో ఎన్టీఆర్ నుంచి ప్ర‌స్తుత ఏపీ సీఎం చంద్ర‌బాబు అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నారు.

 Shock To Nandamuri Harikrishna- Lakshmi Parvathi-TeluguStop.com

త‌ర్వాత ఎన్టీఆర్ మృతితో ల‌క్షీపార్వ‌తి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు.

ఆమె ఆ పార్టీ నుంచి అసెంబ్లీకి కూడా ఎన్నిక‌య్యారు.ఇక 1996 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం సీట్లు గెలుచుకోలేక‌పోయినా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌ణ‌నీయ‌మైన ఓట్లు సాధించింది.

ఇక 1999 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో విబేధించిన ఎన్టీఆర్ కుమారుడు హ‌రికృష్ణ అన్నా తెలుగుదేశం పార్టీ స్థాపించారు.ఆ ఎన్నిక‌ల్లో హ‌రికృష్ణ పార్టీతో పాటు హ‌రికృష్ణ కూడా ఘోరంగా ఓడిపోయారు.

ఈ రెండు పార్టీలు ఆయా ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో త‌ర్వాత జ‌రిగిన ఏ ఎన్నిక‌ల్లోను పోటీ చేయ‌లేదు.దీంతో ఈ రెండు పార్టీల గుర్తింపును ఈసీ ఈ రోజు ర‌ద్దు చేసింది.2005 నుంచి 2015 మధ్య కాలంలో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఈ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది.దేశ‌వ్యాప్తంగా మొత్తం 225 పార్టీల గుర్తింపును ర‌ద్దు చేసిన ఈసీ, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 పార్టీల గుర్తింపు ర‌ద్దు చేసింది.

ఈసీ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల్లోని 12 పార్టీలు ఇవే.

1.ఆల్ ఇండియా సద్గుణ పార్టీ – 2.ఆంధ్రనాడు పార్టీ – 3.అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ) – 4.బహుజన రిపబ్లికన్ పార్టీ – 5.భారతీయ సేవాదళ్ – 6.జై తెలంగాణ పార్టీ – 7.ముదిరాజ్ రాష్ట్రీయ సమితి – 8.నేషనల్ సిటిజన్స్ పార్టీ 9.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి) – 10.సత్యయుగ్ పార్టీ – 11.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ – 12.తెలంగాణ ప్రజా పార్టీ

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube