Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

టీ కాంగ్రెస్‌కు అదిరిపోయే షాక్‌.. టీఆర్ఎస్‌లోకి కీల‌క నేత‌..!-Shock To Congress Party Senior Leader Bhatti Vikramarka To Join TRS

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ దూకుడు ముందు నిల‌వ‌లేక విల‌విల్లాడుతోన్న విప‌క్ష కాంగ్రెస్‌కు ఇప్పుడు దిమ్మ‌తిరిగిపోయే షాక్ త‌గ‌ల‌నుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క గులాబీ పార్టీలోకి చేరిపోతున్నార‌ని, ఆయ‌న టీఆర్ఎస్ ఎంట్రీకి ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని టీ పాలిటిక్స్‌లో విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల ద్వారా స‌మాచారం లీక్ అయ్యింది.

ఖ‌మ్మం జిల్లా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయ‌న‌కు కాంగ్రెస్ అధిష్టానం మంచి ప్ర‌యారిటీయే ఇచ్చింది. ఆయ‌న టీ కాంగ్రెస్‌లో కీల‌క‌నేత‌గా ఉన్నారు. ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా పార్టీ హైకమాండ్ ఇచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా భట్టి పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

Continue Reading
To Top