‘బాహుబలి’పై క్లారిటీ

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ‘బాహుబలి’ గురించి చర్చించుకుంటున్నారు.ఏ ఇద్దరు కలిసినా కూడా ‘బాహుబలి’ కథను అంచనా వేసే పనిలో పడుతున్నారు.

 Shobu Yarlagadda Clarity On Bahubali Story-TeluguStop.com

అయితే ఈ క్రమంలోనే ‘బాహుబలి’ సినిమా కథ మహాభారతంకు కాస్త దగ్గరగా ఉండే అవకాశాలున్నాయంటూ మీడియాలో ప్రచారం మొదలైంది.తాజాగా రాజమౌళి విడుదల చేసిన నాజర్‌ పాత్ర మహాభారతంలోని శఖుని పాత్రలా ఉంది అంటూ అంచనాలు వేస్తున్నారు.

అయితే ఆ వార్తలను నిర్మాత శోభు యార్లగడ్డ తోసిపుచ్చాడు.మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని తేల్చి చెప్పాడు.

ఈ సినిమా కథకు మహాభారతంకు ఎటువంటి సంబంధం లేదని, అసలు ఈ సినిమాలోని ఏ పాత్ర కూడా మహాభారతంలో కనిపించే అవకాశం లేదు అంటూ ఈయన చెప్పుకొచ్చాడు.తాజాగా నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో కథ విషయంపై జరుగుతున్న ప్రచారంకు బ్రేక్‌ పడ్డట్లు అయ్యింది.

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొదటి పార్ట్‌ను జులై 10న విడుదల చేయబోతున్నారు.

ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుష్క మరియు తమన్నాలు హీరోయిన్‌లు.కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube