శశి కపూర్‌కు దాదాసాహెబ్‌ పురస్కారం

భారత దేశ సినీ రంగానికి అత్యుత్తమ సేవను అందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్న పురస్కారం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డుతో గౌరవిస్తుంది.సంవత్సరానికి ఒక్కరికి ఈ పురస్కారం దక్కుతుంది.2014కు గాను బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌కు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది.1951లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన శశికపూర్‌ 1961లో ‘ధర్మపుత్ర’ సినిమాతో హీరోగా మారాడు.దాదాపు 116 సినిమాల్లో నటించిన శశికపూర్‌ పలు రంగాల్లో విశిష్ట సేవను అందించడం జరిగింది.

 Shashi Kapoor To Get Dadasaheb Phalke Award-TeluguStop.com

శశికుమార్‌ తండ్రి పృథ్వీరాజ్‌ కపూర్‌, అన్న రాజ్‌ కపూర్‌లు కూడా ఇప్పటికే దాదాసాహెబ్‌ పాల్కే అవార్డును అందుకున్నారు.ఒకే కుటుంబంకు చెందిన ముగ్గురు వ్యక్తులకు అత్యున్నత పురస్కారం అందడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.1938లో జన్మించిన శశికపూర్‌ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విశమంగా ఉంది.గత కొంత కాలంగా వీల్‌ చెయిర్‌కు పరిమితం అయ్యారు.ఈ దశలో అత్యున్నత పురస్కారం రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు.తన ప్రతిభను గుర్తించిన కేంద్రంకు కృతజ్ఞతలు తెలియజేశాడు.శశికపూర్‌కు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.

ఈయన భార్య జెన్నిఫర్‌ 1984లో క్యాన్సర్‌తో మరణించారు.శశికపూర్‌కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు రావడంతో బాలీవుడ్‌ సినీ ప్రముఖులు ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube