శర్వానంద్ తో అనుపమ రొమాన్స్..!

మలయాళ ప్రేమం సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ గా త్రివిక్రం సెల్యులాయిడ్ నుండి వచ్చిన అఆ సినిమాలో నాగవల్లిగా అదరగొట్టింది.సినిమా అంటే ఎంత డెడికేషనో తెలుగు రాకపోయినా మొదటి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది అనుపమ.

 Sharwanand Romance With Premam Beauty-TeluguStop.com

అందుకే ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి.ప్రస్తుతం ప్రేమం బ్యూటీ తెలుగు ప్రేమంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

నాగచైతన్య హీరోగా చేస్తున్న ఈ ప్రేమంలో మాత్రుకలో చేసిన రోల్ ఇక్కడ కూడా ఆమే చేస్తుంది.

ఇక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అమ్మడు భాగం అవుతుంది.

శర్వానంద్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ‘శతమానం భవతి’ సినిమాలో అనుపమ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట.తెలుగులో ఉన్న విలక్షణ నటుల్లో శర్వానంద్ ఒకరు.

సో మరి అలాంటి ఎక్స్ రాజా సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అనుపమ లక్కీ అని చెప్పాలి.ఆమె పట్టుదల చూస్తుంటే తెలుగులో స్టార్ హీరోయిన్ గా టాప్ చైర్ దక్కించుకునేలానే ఉంది.

మరి అనుపమ టాలీవుడ్ కెరియర్ ఎలా సాగనుందో చూడాలి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube