హత్యయత్నం కేసులో హీరో అరెస్టు

నిన్నటి తరం హీరోల్లో ప్రముఖుడు వినోద్‌ కుమార్‌.20 సంత్సరాల క్రితం ఈయన నటించిన పలు సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఈయన ప్రస్తుతం కూడా పలు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు.నటనతో పాటు వ్యాపారం చేస్తూ ఉన్న వినోద్‌ కుమార్‌పై పోలీసులు హత్య యత్నం కేసును ఫైల్‌ చేశారు.

 Senior Hero Vinod Kumar Arrested-TeluguStop.com

తన వద్ద పని చేస్తున్న సచ్చిదానందం అనే వ్యక్తిని వినోద్‌ కుమార్‌ మరియు ఆయన స్నేహితుడు ఉదయ్‌లు చంపబోయారు.తన వద్ద ఫైనాన్స్‌ విషయాలను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న సచ్చిదానందంను వినోద్‌ కుమార్‌ ఎందుకు చంపాలని భావించాడు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

సచ్చిదానందంను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించాలని వినోద్‌ కుమార్‌ మరియు ఆయన స్నేహితుడు ఉదయ్‌లు భావించారు.కాని అది కాస్త రివర్స్‌ అవ్వడంతో ఇద్దరు కూడా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క బెడుతున్నారు.

ఇంతకు సచ్చిదానందంను వినోద్‌ కుమార్‌ ఎందుకు చంపాలని భావించాడు అనే కోణంలో పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.అతి త్వరలోనే ఆ విషయం వెళ్లడయ్యే అవకాశాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube