Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అవకాశాల కోసం "పడుకోవటం" పై సీనియర్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ -Senior Actress Gautami Speaks On “$exual Favours”

కాస్టింగ్ కౌచ్ … సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పదం. అంటే అవకాశాల కోసం అవకాశం ఇచ్చేవారికి కొన్నిరకాల ఫెవర్స్ చేయడం. ఆ ఫేవర్ ఏమిటి అనేది కొత్తగా చెప్పనక్కరలేదు. సింపుల్ గా చెప్పాలంటే అవకాశాల కోసం శరీరాన్ని అర్పించడం. ఇది దశాబ్దాలుగా జరుగుతున్న తంతు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ. ఎందుకంటే ఇది గ్లామర్ ప్రపంచం. కాని ప్రపంచంలో అందరు ఒకేరకంగా ఉండరు కదా. భారత్ దేశంలో పేదరికం ఉంటే అంటే అర్థం దేశంలో ఉన్నవారు అందరు పేదవారు కాదు కదా. సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. కొందరికి పనికి మించిన పని మరొకటి ఉండదు. టాలెంట్ ఉంటే అవకాశం ఇస్తారు, టాలెంట్ ని మాత్రమే వాడుకుంటూ తమ పని తాము చేసుకుంటారు. అలాగే అందరు హీరోయిన్లు అలానే ఉండరు. టాలెంట్ మీద పైకి రావాలి అనుకునేవారు ఉంటారు అలాగే అవకాశాల కోసం కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఎవరి సొంత అభిప్రాయం వారిది.

ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నారు సీనియర్ నటి గౌతమి. ఆమె మీడియాతో మాట్లాడటం చాలా అరుదు. చాలాకాలం తరువాత ఈమధ్య కమల్ హాసన్ తో వేరుపడి వార్తల్లో నిలిచారు. మళ్ళీ ఆ తరువాత మీడియాకి కనిపించని గౌతమి, ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. “కాస్టింగ్ కౌచ్ గురించి మనం ఈమధ్యకాలంలో బాగా వింటున్నాం. కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఉన్నమాట వాస్తవమే. కాని కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, అంతటా ఉంది. జీవితంలో ఎదగడం కోసం, పైకి రావడం కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తారు. చాలా విషయాల మీద కాంప్రమైజ్ అవుతారు. ఎలాంటి విషయాల మీద కాంప్రమైజ్ అవ్వాలి అనేది వారి సొంత నిర్ణయం. కాని కాంప్రమైజ్ అయినప్పుడు, ఆ తరువాత ఎదురయ్యే పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చారు గౌతమి.

ఈమధ్య మీడియా వలన కాస్టింగ్ కౌచ్ కి ప్రచారం లభించింది కాని, నిజానికైతే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో చాలావరకు తగ్గింది. ఈ విషయాన్ని తెలుగు క్యారక్టర్ ఆర్టిస్టు హేమ కూడా చెప్పారు. ఒకప్పుడు ఇలాంటివి ఎక్కువ జరిగేవి అని, కాని ఇప్పుడు బాగా చదువుకున్నవారు ఇండస్ట్రీలోకి వస్తూ ఉండటంతో, ఎవరితో ఎలా మెదలాలి, ఎవరికీ ఎలాంటి గౌరవం ఇవ్వాలి అని బాగా ఆలోచిస్తున్నారు అంటూ చెప్పారు హేమ.

Continue Reading
More Posts
To Top