హెడ్ ఫోన్స్ మోసుకొచ్చే ప్రమాదాలు

ఇప్పుడున్న లైఫ్ స్టయిల్ కి, జనాలకి ఊరటనిచ్చేది ఏది అంటే అది సంగీతమే.అందుకే మొబైల్స్ ఫోన్ కాల్స్ కి తక్కువ, మీడియా ప్లేకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి.

 See How Headphones Can Ruin Your Ears And Brain-TeluguStop.com

ఈ ట్రెండ్ వలనే హెడ్ ఫోన్స్ వచ్చాయి.ఇంకెవరికి వినిపించకుండా, ఇష్టమైన సంగీతంలో ఏకాంతంగా లీనమైపోవడానికి హెడ్ ఫోన్స్ ఉపయోగపడతాయి.

గంటలకొద్దీ ప్రయాణం చేయాల్సివచ్చే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో హెడ్ ఫోన్స్ లేకుండా బయటకి వెళ్ళదు యువత.కాని నాణానికి మరోవైపు ఉన్నట్లు, హెడ్ ఫోన్స్ వలన నష్టాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలియనిది కాదు.

అవేంటో చూద్దాం.

* హెడ్ ఫోన్స్ అతిగా వాడితే గులిమి ఎక్కువగా ఏర్పడుతుంది.

అంతేకాదు, గాలి మార్గం బ్లాక్ అయ్యి ఇంఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.

* హెడ్ ఫోన్స్ పెట్టుకోని హై వాల్యూమ్ లో ఎక్కువగా సంగీతం వింటే చెవుల్లో తిమ్మిరి రరావచ్చు, దాంతో తాత్కాలికంగా వినికిడి తగ్గవచ్చు.

ఇలా తరుచుగా జరిగితే శాశ్వతంగా వినికిడి శక్తి దెబ్బతినవచ్చు.

* అదేపనిగా హెడ్ ఫోన్స్ ఎప్పుడు వాడొద్దు.

సినిమా చూస్తున్నాసరే .కాసేపు విరామం ఇచ్చి, తరువాత మళ్ళీ వాడుకోవచ్చు.వాల్యూమ్ గనుక 90 డెసిబుల్స్ దాటితే ఇక ప్రమాదమే.

* హెడ్ ఫోన్స్ విడుదల చేసే విద్యుదయస్కాంత తరంగాలు మెదడుపై తీవ్ర ప్రభావం చూపవచ్చు అని కొత్తగా చెప్పనక్కరలేదు.

అందుకే మార్కెట్లో దొరికే బ్లూటూత్ స్పీకర్స్ ని కొనుక్కుంటే మంచిది.ఇంట్లో ఉన్నప్పుడైనా హెడ్ ఫోన్స్ పై అతిగా ఆధారపడాల్సిన పని ఉండదు.

* ఒకరు వాడిన హెడ్ ఫోన్స్ మరొకరు వాడితే, బ్యాక్టీరియా ట్రావెల్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.అలాగే హెడ్ ఫోన్స్ ని అక్కడిక్కడ పెట్టడం వలన బ్యాక్టీరియా అంటుకుంటుంది.

దాన్నే మళ్ళీ మీరు చెవిలో పెట్టుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube